ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలపై విజయకేతనం ఎగురవేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్, ఏపిలో వైసీపీ దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ  భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.  అభివృద్ది మంత్రంగా తెలంగాణలో టీఆర్ఎస్ జోరు కొనసాగించగా... ఇదే బాటలో ఢిల్లీలో కేజ్రీవాల్ తన అభివృద్దినే ప్రజలకు చూపించి ఓట్లు తన ఖాతాలో వేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.  మొదటి నుంచి ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ కే ఎక్కువ ఓట్లు వస్తాయని పలు సర్వేలు తెలిపాయి.  అనుకున్నట్లుగానే భారీ మెజార్టీతో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుపొందింది.  మరోసారి సీఎం పీఠం కేజ్రీవాల్ దక్కించుకున్నారు.

 

తాజాగా సీఎం కేజ్రీవాల్ మరో రికార్డు కైవసం చేసుకున్నారట.   ఆమ్‌ ఆద్మీ పార్టీ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది  కేవలం 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా పది లక్షల మంది(1 మిలియన్‌) ఆ పార్టీలో భాగస్వామ్యం అయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజు ఆమ్‌ ఆద్మీ తమ పార్టీలో భాగస్వామ్యం అయ్యేందుకు ఓ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని సూచించింది.  అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 62 సీట్లను ఆప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంటే ఒక్క రోజులోనే దాదాపు 11 లక్షల మంది ఈ క్యాంపెయిన్‌లో భాగస్వాములు అయ్యారు.

 

దీనిపై పార్టీ స్పందిస్తూ.. ‘ఒక్క రోజులోనే 11 లక్షల మంది పార్టీలో చేరారు.  ఈ విషయాన్ని ఆప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  అయితే దేశంలో గత కొంత కాలంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నట్లు ఎన్నో సంకేతాలు వినిపించాయి.  ఆ మద్య జరిగిన ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరంగా మారింది.  కొన్ని చోట్ల మినహా కాంగ్రెస్ ప్రాభవం ఎక్కడ చూపించుకోలేక పోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: