నరేంద్రమోడితో జగన్మోహన్ రెడ్డి భేటి ఫలితం బాగానే కనిపిస్తున్నట్లే ఉంది. ఎందుకంటే శాసనమండలి రద్దు తీర్మానం కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి దగ్గరకు చేరినట్లు సమాచారం. మండలిని రద్దు చేస్తు ఏపి అసెంబ్లీ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం ఢిల్లీకి చేరిన విషయం అందరికీ తెలిసిందే.  ముందుగా కేంద్ర హోంశాఖకు చేరిన తీర్మానం తర్వాత న్యాయశాఖకు చేరింది. అక్కడ క్లియరెన్స్ తీసుకుని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ఆఫీసుకు చేరినట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయి. అంటే మండలి రద్దు తీర్మానం ప్రక్రియ ఢిల్లీలో వేగంగా ముందుకెళుతున్నట్లే  అనుకోవాలి.

 

టిడిపి శాడిజానికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశ్యంతోనే జగన్మోహన్ రెడ్డి ఏకంగా శాసనమండలిని  రద్దు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన రెండు కీలక బిల్లులను మెజారిటి ఉందన్న ఏకైక కారణంతో  టిడిపి అడ్డుకుంది. అడ్డుకోవటం కూడా నిబంధనల ప్రకారం అడ్డుకుందా ? అంటే అదీ లేదు. ఛైర్మన్ ఎంఏ షరీఫ్ తమ పార్టీ సభ్యుడే కావటంతో నియమ, నిబంధనలను ఉల్లంఘించి మరీ కంపు చేసేసింది.

 

ఎప్పుడైతే చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు ఛైర్మన్ ను మ్యానేజ్ చేసి కంపు చేస్తున్న విషయం బయటపడిందో వెంటనే  జగన్ కు మండిపోయింది. అందుకనే అసలు మండలినే రద్దు చేసేస్తే ఏ గొడవా ఉండదని డిసైడ్ అయ్యాడు. దాంతో రద్దు ప్రక్రియ స్పీడుగా మొదలైంది. దాని పర్యవసానమే మండలిని రద్దు చేయాలంటూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం.

 

ఎప్పుడైతే మండలిని రద్దు చేయాలని జగన్ డిసైడ్ అయ్యారన్న విషయం బయటపడిందో వెంటనే చంద్రబాబు అలర్టయ్యారు. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా పావులు కదపటం మొదలుపెట్టారు. మండలి రద్దు జగన్ అనుకున్నట్లు జరగదంటూ కతలు చెప్పటం మొదలుపెట్టారు. కానీ జగన్ మాత్రం రద్దు ప్రతిపాదనపై కేంద్రంతో గట్టిగానే మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలిసినపుడు గట్టిగా చెప్పిన విషయాల్లో మండలి రద్దు కూడా ఒకటి. మిగితా రాష్ట్రాల డిమాండ్లతో  సంబంధం లేకుండా ఏపిలో మండలి మాత్రం రద్దు అయిపోవటం ఖాయమనే అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: