మాగంటి రూపాదేవి.. రాజ‌మ‌హేంద్ర‌వరం మాజీ ఎంపీ, సీనియ‌ర్ టీడీపీ లీడ‌ర్‌, ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు మాగంటి ముర‌ళీమోహ‌న్ కోడ‌లు. మాగంటి రూపాదేవి ఉన్న‌త విద్యావంతురాలు. కీల‌క‌మైన ప్ర‌పంచ స్థాయి ఉద్యోగాలు చేసిన అనుభ‌వం ఉంది. కాని, మామ గారు వేసిన రాజ‌కీయ‌బాట‌లో న‌డిచి.. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే 2014 ఎన్నిక‌ల్లో ముర‌ళీ మోహ‌న్‌.. రాజ‌మండ్రి నుంచి టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. దీంతో ఆయ‌న‌కు అన్ని విధాలా రూపాదేవి సాయం చేశారు. పార్టీలోనూ చంద్ర‌బాబు మాగంటి రూపాదేవి సేవ‌ల‌ను వినియోగించుకున్నారు.

 

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు మామ మాగంటి ముర‌ళీ మోహ‌న్‌కు చేదోడు వాడోడుగా ఉంటూ రాజ‌మండ్రి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డంతో మంచి పేరు పాదించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబును కూడా ఆక‌ర్షించింది మాగంటి రూపాదేవి. అలాగే ముర‌ళీ మోహ‌న్‌కి ఆరోగ్యం బాగోలేని ప‌రిస్థితిలో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి అన్నీ తానై ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచారు మాగంటి రూప‌. ఇక గ‌త ఎన్నిక‌ల్లో మాగంటి మురళీమోహన్ ప్రత్యక్ష ఎన్నికల నుంచి వైదొలగడంతో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎవరిని పోటీ చేయించాలన్న దానిపై చంద్రబాబు పెద్ద కసరత్తే చేశారు. 

 

చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఇద్దరు బడా పారిశ్రామికవేత్తల పేర్లను పరిశీలించి చివరకు నామినేషన్ల పర్వం ప్రారంభం అయ్యాక రూపాదేవి పేరు ఖరారు చేశారు. అయితే, జ‌గ‌న్ సునామీ, ఒక్క ఛాన్స్ ముందు మాగంటి రూపాదేవి ల‌క్ష పైచిలుకు ఓట్ల తేడాతో ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక మాగంటి రూపాదేవి  స్వస్థలం కృష్ణ‌జిల్లా గుడివాడ‌. ఈమె చ‌దువుకుంటున్న టైమ్‌లో ముర‌ళిమోహ‌న్ కుమారుడు రామమోహన్‌తో ప్రేమ‌లో ప‌డండి. ఆ త‌ర్వాత ఎన్నో క‌ష్ట‌లు ప‌డి పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఒకే ఒక్క ఆడ‌పిల్ల‌. ఇక ఆ త‌ర్వాత పిల్ల‌లు వ‌ద్ద‌నుకుంటే.. ముర‌ళీమోహ‌న్ ముందు త‌ట‌ప‌టాయించినా చివ‌ర‌కు ఓకే చెప్పారు. కాగా, ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌వ‌డంతో రాజ‌కీయ ప‌రంగా సైలెంట్ అయిపోయారు రూపాదేవి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: