దొనకొండ..పరిచయం అవసరం లేని ప్రాంతం. ప్రకాశం జిల్లాలో ఉన్న దొనకొండ ప్రాంతం చాలా కాలంగా ఏదో ఓ రూపంలో వార్తల్లో నిలుస్తునే ఉంది.  వార్తల్లో ఎంతగా ప్రచారంలో నలుగుతున్నా అభివృద్దికి మాత్రం పెద్దగా నోచుకోలేదనే చెప్పాలి. ఇటువైపు ఎవరూ ఎందుకు చూడలేదు ? ఎందుకంటే ఈ ప్రాంతంలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడంతా అద్దిరిపోయే ఉష్ణోగ్రత ఉంటుందట. అందుకనే ఏ ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు.

 

సీన్ కట్ చేస్తే ఎనిమిది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ ఈ ప్రాంతంపై  ప్రత్యేక దృష్టి పెట్టారు. మిగిలిన ప్రాంతాలతో పాటు దొనకొండను కూడా డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యారు. దాంతో  ఈ ప్రాంతంలో ఎటువంటి డెవలప్ చేయచ్చనే విషయాన్ని నిపుణులతో మాట్లాడారు. దాంతో సోలర్ పవర్ ప్రాజెక్టులు పెడితే బ్రహ్మాండంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయచ్చని అర్ధమైంది.

 

దాంతో అదే విషయమై అధికారులతో జగన్ విస్తృతంగా చర్చలు జరిపారు. ఇంకేముంది కొందరు ఉన్నతాధికారులు దొనకొండలో క్షేత్రస్ధాయిలో పరిశీలన జరిపారు. సుమారు 26 వేల ప్రభుత్వ భూమి ఉందని ప్రాధమికంగా గుర్తించారు. ఈ ప్రాంతంలోని వద్దిపాడు, పోచమక్కపల్లి,  రుద్రసముద్రం గ్రామాల పరిధిలోని 5 వేల ఎకరాల్లో సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయచ్చని అంచనాకు వచ్చారు.

 

నెడ్ క్యాప్ ఆధ్వర్యంలోని ఓ నిపుణుల బృందం జరిపిన పరిశీలనలో  పై గ్రామాల్లో వెయ్యి మెగావాట్ల సోలార్ ఉత్పత్తికి బ్రహ్మాండంగా అవకాశాలున్నట్లు నిర్ధారణకొచ్చారు. అంటే వెయ్యిమెగావాట్ల ఉత్పత్తంటే సుమారుగా రూ 4 వేల కోట్ల పెట్టుబడి అవసరం. పనులు మొదలుపెట్టిన దగ్గర నుండి ఏడాదిలోగా పూర్తి చేసి ఉత్పత్తి మొదలుపెట్టవచ్చని నెడ్ క్యాప్ ఉన్నతాధికారులు అంచనాకు వచ్చారు.

 

ప్రభుత్వం ఎలాగూ 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తిని టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో వెయ్యి మెగావాట్లు దొనకొండ నుండే వస్తుందనేటప్పటికి ఉన్నతాధికారులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇక పనులు మొదలుపెట్టటమే ఆలస్యం చూద్దాం ఎప్పుడు మొదలవుతుందో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: