ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభం అయ్యాయి. దేశ‌ పరిపాలనా కేంద్రంగా ఉన్న ఢిల్లీలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బిజెపి నేతలు వేసిన ఎత్తులు చిత్తు అయ్యాయి. భవిష్యత్తులో మోడీకి రాజ్యసభలో బలం ఉండాల్సిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న మోడీకి ప్రాంతీయ పార్టీల లో కొత్త మిత్రులు అవసరం కానున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ తో పాటు .. తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌పై మోడీ దృష్టి పెట్టిన‌ట్టు ఇప్పుడు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 

మోడీకి ఆ మాటకు వస్తే ఎవరు మిత్రులు కాదు... ఎవరు శత్రువులు కాదు అన్న‌ట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. మోడీ కి కావాల్సింది అవసరం మాత్రమే అన్న‌ది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ తోపాటు తమిళనాడులో డీఎంకే మోడీ ఎన్డీయేలోకి ఆహ్వానించ బోతున్నార‌న్న వార్త‌లు  జాతీయ స్థాయిలో జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇక వైసీపీ ఎన్డీయేలోకి వెళ్లాలంటే ఏపీలో జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఒక ఎంపీ సీటును బీజేపీకి ఇవ్వాల‌న్న కండీష‌న్ కూడా పెడ‌తార‌ని అంటున్నారు.


 
ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగే నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు వైసీపీ ఖాతాలోనే ప‌డ‌తాయి. బీజేపీ కోరిన నేప‌థ్యంలో వైసీపీ ఎన్డీయేలో చేరితే ఆ పార్టీకి రెండు కేంద్ర మంత్రి ప‌ద‌వులు వ‌స్తాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. 
వైసీపీకి చెందిన ఎస్సీ, రెడ్డి వర్గం ఎంపీల‌కు ప‌ద‌వులు వ‌స్తాయ‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. రెడ్డి వ‌ర్గం నుంచి వైసీపీకి ల‌భించే ప‌ద‌వుల్లో ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

 

ఇక ఎస్సీ వ‌ర్గం నుంచి బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ పేరు లైన్లో ఉంది. ఓ సామాన్య కార్య‌క‌ర్త‌గా పార్టీలో ఉన్న సురేష్‌కు జ‌గ‌న్ ఏకంగా బాప‌ట్ల ఎంపీ సీటు ఇవ్వ‌డం.. స్వ‌ల్ప మెజార్టీతో గెలిచిన సురేష్ ఎంపీ అవ్వ‌డం జ‌రిగాయి. ఇప్పుడు సురేష్‌కు ఎస్సీ కోటాలో కేంద్ర మంత్రి ప‌ద‌వి అంటే అది పెద్ద సంచ‌ల‌న‌మే అవుతుంది. మ‌రి ఈ ఈక్వేష‌న్లు ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అవుతాయో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: