నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మ‌న్ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు ఇప్ప‌టినుంచే ట‌గ్ ఆఫ్ వార్ కోల్డ్ వార్ కంటిన్యూ అవుతోంది. తెలంగాణ రాష్ర్టం ఎర్పడిన తరువాత జరుగుతున్న తొలి సహకార సంఘాల ఎన్నికలలో డీసీసీబీ పీఠాన్ని త‌మ వ‌ర్గానికే వ‌చ్చేలా చేయాల‌ని గులాబీ నేత‌ల మ‌ధ్య నువ్వా నేనా అన్న చందంగా పోటీ నెల‌కొంది.  ఈసారి జరిగే ఎన్నికలలో ప్రధానంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి , రాష్ర్ట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తమ నియోజకవర్గాలకు, తమ కుటుంబ సభ్యులకు కావాలని పట్టుబడుతున్నార‌ని స‌మాచారం. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి తనయుడు దేశాయ్ సింగిల్ విండో చైర్మెన్ రెండోసారీ ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 

శాసన సభ ఎన్నికల సంధర్బంగానే సీఎం కేసీఆర్ పోచారంకు డీసీసీబీ విషయంలో ఆభయం లభించిందని అందుకే భాస్కర్ రెడ్డి కుడా నామినేష‌న్ల‌ను చివ‌రి రోజు  అందుకే దాఖలు చేశారని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే మూడు ధశాబ్ధలకు పైగా ఆర్మూర్ డివిజన్‌కు డీసీసీబీ రాలేద‌ని  ఈ సారి ఆవకాశం అక్కడి వారికే దక్కుతుందనే విశ్లేషకులు చెబుతున్నారు. వెల్పూర్ సింగిల్ విండో సోసై టీ చైర్మ‌న్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనా రమేష్ రెడ్డి కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదిష్టానం వద్ద ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

 

తెలంగాణ ఉధ్యమ సమయం నుంచి కేసీఆర్ వేన్నంటి ఉండి అంకాపూర్ సింగిల్ విండో ఛైర్మెన్ గా ఎన్నికైనా మారా గంగారెడ్డి సైతం  తనకే డీసీసీబీ పిఠం  అని ఘంటాప‌థంగా ప్ర‌చారం చేసుకుంటున్నారు.అధిష్ఠానం నుంచి త‌న‌కు హామీ ల‌భించింద‌ని ఇప్ప‌టికే త‌న స‌న్నిహితుల వ‌ద్ద చెప్పుకుంటున్నార‌ట‌. నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా తండ్రి బిగాల మూర్తి సైతం మాక్లూర్ సింగిల్ విండో 1 వ డైరెక్టర్ గా గెలిచి బరిలో నిలిచారు. ఐతే మాక్లూర్ మండలం నుంచి ఇప్పటికే జిల్లా పరిషత్ ఛైర్మెన్ ఉండటంతో అక్కడ వారికి అవకాశాలు తక్కువే అని చెబుతున్నారు పార్టీ నేతలు.

 

బోధన్ శాసన సభ్యులు షకీల్ అనుచరుడు గిర్ధావర్ గంగారెడ్డి కుడా రేస్ లో ఉన్నాడని చెబుతున్నా అయనకు డీసీసీఎంఎస్ ప‌ద‌వి ఇస్తారనే ప్రచారం ఉంది. సీఎం కేసీఆర్ అశీస్సులు ఎవ్వరికి ఉంటే వారే డీసీసీబీ చైర్మ‌న్ కావ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. డీసీసీబీ కోసం పట్టుబడుతున్న స్పీకర్, మంత్రుల్లో ఎవ‌రివైపు సీఎం మొగ్గు చూపుతారో అన్న‌దే ఇప్పుడు ఆస‌క్తి రేకిస్తున్న అంశం. ఈ నెల 15 తో ఎన్నికలు, ఫలితాల తరువాత రోజు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మెన్ పధవి  ఎవ్వరికి అనేది జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల మాదిరిగా సీల్డ్ కవర్ లో  పేరు వచ్చే వారు చైర్మ‌న్ కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: