ప్రేమించానని నమ్మించడం తీరా ప్రేమ లో పడ్డాక కావాలసిన కోరికలు తీర్చుకొని అడ్రెస్ ను మార్చేశాడు. వివరాల్లోకి వెళితే.. హైదారాబాద్ లోని ఓ హోటల్ యజమాని కూతురి తో ఓ ఆటో డ్రైవర్ ప్రేమాయణం సాగించాడు. అలా తరచూ చనువుగా ఆమెతో ఉండేవాడు. నెమ్మదిగా ప్రేమ అంటూ నమ్మించాడు. మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

 

ప్రేమించిన వాడి తో పెళ్లి జరిపించాలని బాధితురాలు ఆత్మ హత్యకు యత్నించింది. నిజాంపేట రాజీవ్‌గృహకల్ప సముదాయం లో నివసించే ఓ కుటుంబం కూకట్‌పల్లి జేఎన్‌టీయూ వద్ద ఓ హోటల్‌ నిర్వహిస్తోంది. ఈ క్రమం లో బాచుపల్లికి చెందిన ఆటోడ్రైవర్‌ రవిగౌడ్‌ హోటల్‌కు అవసరమైన సరకులను సరఫరా చేసేవాడు.తనను పెళ్లి చేసుకోవాలని యువతి నిలదీయడంతో కనిపించకుండా తిరుగుతున్నాడు.

 

విషయానికొస్తే.. ఆమె రవిగౌడ్‌ గురించి ఆరా తీయగా అతడికి అప్పటికే పెళ్లయి, ఇద్దరు పిల్లలున్నట్లు తెలియడంతో షాకైంది. పెళ్ళై కూడా తనను ప్రేమించానని నమ్మించి మోసం చేసాడని కన్నీరు మున్నీరు అయింది. తానూ పూర్తిగా మోసాపోయానని తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు  చేయాలనీ నిర్ణయించుకొని పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయాన్నీ తల్లి దండ్రుల కు చెబితే వారు చామేస్తారని భయపడి చెప్పకుండా వచ్చింది. 

 


ఈ మేరకు బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదుచేసింది. పోలీసులు ఆమెను విచారిస్తున్న సమయం లో నీరసంగా కనిపించడం తో ఏమైందని అడిగారు. తాను పురుగుల మందు తాగి స్టేషన్‌ కు వచ్చినట్లు చెప్పడం తో వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. రవిగౌడ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీ లో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి పర్వాలేదని వాడీలు చెప్పారు. ప్రేమ అంటే అమ్మాయిలు ఆలోచించకుండా నమ్మి మోస పోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: