ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మండలి వ్యవహారం గత కొన్ని రోజులుగా నానుతూనే ఉంది. రాజకీయంగా అసలు నానా అవస్థలు పడుతున్న తెలుగుదేశం పార్టీకి ఇది ఇప్పుడు చాలా వరకు ఇబ్బందిగా మారింది అనేది వాస్తవం. మండలిలో తనకు ఉన్న బలాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు వికేంద్రీకరణ బిల్లుని ఆపించారు. తన అత్యంత సన్నిహితుడు, ఆప్త మిత్రుడు అయిన యనమల రామకృష్ణుడు ద్వారా ఈ బిల్లుని చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా ఆపించారు. అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. 

 

చంద్రబాబు రాజకీయ వ్యూహాల్లో యనమలకు కూడా కాస్త పాత్ర ఉంటుంది. చంద్రబాబు చేసేవి యనమలకు తెలియకుండా ఉండవు. అయితే మండలిలో రాజధాని బిల్లు ఆగిన తర్వాత యనమల కాస్త ఆ పార్టీలో హీరో అయ్యారు. చంద్రబాబు ఇందుకే యనమలను నెత్తిన పెట్టుకునేది అంటూ ఎవరికి తోచింది వాళ్ళు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇక ఎమ్మెల్సీలు అందరూ పార్టీ ప్రధాన కార్యదర్శిని లోకేష్ ని కాదని, యనమలను ఎక్కువగా సంప్రదించడం మొదలుపెట్టారు. మండలిలో లోకేష్ కూడా సభ్యుడిగానే ఉన్నారు. 

 

అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి తప్పించి ఏమీ లేదు. దీనితో లోకేష్ దూకుడు పెంచి యువ ఎమ్మెల్సీలు అందరూ నా మాట వినాలి అంటూ, అందరం కలిసి ఢిల్లీ వెళ్దాం న్యాయ శాఖా మంత్రిని కలుద్దాం అంటూ సొంత పెత్తనాలు చేస్తున్నారట. మండలిలో యనమల అంతా తానే అయితే తన పరిస్థితి ఏంటీ అనే ఆందోళన లోకేష్ లో ఎక్కువగా ఉందట. దీనితో భవిష్యత్తులో మీకు పదవులు కావాలి అంటే నా వద్దకే రావాలి కాబట్టి మీరు యనమలతో కాస్త దూరంగా ఉండమని చినబాబు చెప్పారట. ఇక ఈ విషయం యనమలకు తెలియడం, యనమలకు అంత గ్రాఫ్ లేకపోవడంతో చినబాబు చెప్పినట్టు చేస్తున్నారు కొందరు ఎమ్మెల్సీలు. ఈ పంచాయితి చివరికి బాబోరి వద్దకు కూడా వెళ్లిందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: