జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన పవన్ కు భారీ షాక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనకు వచ్చినా కర్నూలులో పవన్ పర్యటనకు జనాలు భారీగా హాజరు కాకపోవడం గమనార్హం. వైసీపీ పార్టీ గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా 14 నియోజకవర్గాల్లోను ఘనవిజయం సాధించింది. జనసేన పార్టీ కర్నూలు జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. 
 
నిన్న ఉదయం పవన్ కళ్యాణ్ కర్నూలుకు చేరుకోగా రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు పవన్ కళ్యాణ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ మూడు రాజధానులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని పవన్ వెంటనే కర్నూలు నుండి వెళ్లిపోవాలని రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు పలువురు విద్యార్థులను అరెస్ట్ చేయడంతో అక్కడ పరిస్థితులు చక్కబడ్డాయి. 
 
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అత్యాచార ఘటన గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విమర్శలు చేయటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు ప్రలోభాలాకు లోబడి ఓట్లేస్తున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో జనసేన పార్టీ గెలవనంత మాత్రాన ప్రజలు ప్రలోభాలకు లోబడి ఓట్లేసినట్లా...? అని ప్రజలు పవన్ ను ప్రశ్నిస్తున్నారు. 
 
నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్నూలులో అభివృద్ధి దిశగా ముందడుగులు పడ్డాయి. కానీ చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో కర్నూలు జిల్లాను రాయలసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులలో ఒక రాజధానిగా కర్నూలును ప్రకటించడంతో పాటు కర్నూలు అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీకి కంచుకోట అయిన కర్నూలులో పవన్ తన పర్యటన ద్వారా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడనే చెప్పాలి.     

మరింత సమాచారం తెలుసుకోండి: