జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కర్నూలులో పర్యటించడం జరిగింది. 2017 వ సంవత్సరం లో సుగాలి ప్రీతీ అనే బాలికపై కొంతమంది దుండగులు అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. గిరిజన మహిళకు చెందిన ఈ బాలిక విషయంలో చంద్రబాబు మరియు జగన్ ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సుగాలి ప్రీతీ తల్లి ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది. దీంతో ఆ తల్లి బాధ విన్న పవన్ కళ్యాణ్ ఇటీవల కర్నూల్ ప్రాంతంలో రంగంలోకి దిగి సుగాలి ప్రీతీ ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలని ఈ ఘటనకు పాల్పడిన వారికి ఇప్పటి వరకు శిక్ష పడలేదని కేసు కూడా చాలా నిర్లక్ష్యంగా సాగుతోందని మండిపడ్డారు. రాయలసీమ ఆడపిల్లకు ఇలాంటి అన్యాయం జరిగితే రాయలసీమ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి ఏమాత్రం స్పందించకపోవడం దారుణమని జగన్ ని విమర్శించారు.

 

ఎన్నికలలో ఓడిపోయినా జనసేన పార్టీ రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న ప్రతి అన్యాయానికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా పవన్ పేర్కొన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కర్నూల్ పర్యటన ఉద్దేశించి వైసిపి పార్టీ పై చేసిన విమర్శలకు పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషించడం జరిగింది. దీంతో ఈ విషయం జగన్ దృష్టికి వెళ్లడంతో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ అన్నట్టుగా..కర్నూల్ కళ్యాణ్ పర్యటనకు పార్టీ తరుపున కౌంటర్లు వేసిన వైసీపీ నాయకుల పై జగన్ సీరియస్ అయ్యాడట.

 

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలకు సంబంధించి వెళ్లవద్దని చాలా సార్లు చెప్పా అయినా కానీ అదే తప్పు మళ్లీ చేస్తున్నారు అది కూడా మీడియా ముందు బహిరంగంగా అంటూ సొంత పార్టీ నేతలపై జగన్ సీరియస్ అయ్యారట. ఇలా చేయడం వల్ల పబ్లిక్ లో రాజకీయంగా పవన్ కళ్యాణ్ ని ఎదురుకొనే సత్తా అధికార పార్టీలో లేదని అటువంటి మెసేజ్ వెళ్తుందని వైసిపి నాయకులకు జగన్ క్లాస్ తీసుకున్నరట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: