మీ శరీరం పైన వచ్చే ముడతల కలిగే మరకల వలన విశ్రాంతి కూడా సరిగా తీసుకోలేము. మీ చర్మం ఉపరితలం పైన ముడతల వలన వచ్చే మార్పుల వలన చూడటానికి అసహ్యంగా కనిపిస్తుంటారు. గర్బ సమయంలో మీ శరీరంలో వచ్చే శారీరక మార్పులు అనగా ఆకృతి, ఇతర మార్పుల వలన మీ చర్మం ముడతలకి గురి అయ్యి మరకలు ఏర్పడతాయి, యుక్త వయస్సు లేదా బరువు పెరగటం వలన కూడా ఇవి ఏర్పడవచ్చు. 98 శాతం గర్బవతులలో నడుము చుట్టూ లేదా తొడలపై మరియు పిరుదులపై ముడతల వలన మరకలు కలుగుతాయి. కానీ కొన్ని మార్గాలను అనుసరించటం వలన చర్మం పైన మడతల వలన వచ్చె మరకలను తొలగించవచ్చు.

 


చర్మం పైన మడతల వలన వచ్చే మరకలను తొందరగా తొలగించటానికి మసాజ్ మరియు వేడి నీటితో స్నానం చేయటం వలన మీరు త్వరిత ఫలితాన్ని పొందుతారు. ఇది చాలా మంచి మార్గం మరియు మరకలను తొలగించుటకు సులువైన మార్గం. మసాజ్ మరియు వేడి నీటితో స్నానం చేయటం వలన చర్మ కణాలకు రక్త ప్రసరణ సరిగా జరిగి తిరిగి కణాలు వాటి పూర్వపు స్థితిని సంతరించుకొని మడతలు తొలగిపోతాయి. మీ చర్మానికి మసాజ్ చేయటానికి కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్’లను వాడటం వలన చర్మం ఎల్లపుడు తేమబరితంగా ఉంచుతాయి.

 


‘యూనివర్సిటీ ఆఫ్ మిచ్ గాన్’ వారు జరిపిన పరిశోదనల ఆధారంగా, నూతంగా ఏర్పడిన ముడతల వలన కలిగిన మరకలకు రెటీనా ‘A’ వాడటం వలన త్వరిత ఫలితాన్ని పొందవచ్చు అని తెలిపారు, ఇవి చర్మ ఉపరితలం పైన ఏర్పడే ముడతల వలన ఏర్పడే మరకలను త్రోలగించుటలో శక్తివంతంగా పనిచేస్తాయి అని తెలిపారు. కానీ దీని వలన తెలిసిన దురదృష్టకరమైన వార్తా- ఈ రెటీనా ‘A’ పాత మడతల వలన కలిగిన మరకలను తొలగించలేదు అని కనుగొన్నారు. రెటీనా ‘A’ వాడినపుడు కొన్ని రకాల సూచనలు పాటించాలి అవి- రెటీనా ‘A’ వాడినపుడు తక్కువగా సూర్య కాంతికి బహిర్గతం అవ్వాలి. ఒకవేళ మీరు గర్బవతి కాకున్నను సూర్యకాంతికి బహిర్గతం అవటం వలన శిశు జనన సమయంలో సమస్యలు కలుగవచ్చు.

 


మడతల వలన చర్మంపైన కలిగే మరకలను తొలగించుటకు మరొక మార్గం కూడా ఉంది. నిమ్మరసం సహజ సిద్ధమైన ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది ఇది మరకలను సులభంగా తొలగిస్తుంది. అంతేకాకుండా నిమ్మకాయ రసం వివిధ రకాల చర్మ సమస్యలకు అనగా గాయాలు, మొటిమలకు, ఇతరేతర వాటికి కూడా మంచి ఔషదంగా పనిచేస్తుంది. తాజా నిమ్మకాయ రసాన్ని తీసుకొని ప్రభావిత ప్రాంతాలలో రాయాలి మరియు నిమ్మకాయ రసంలో చర్మం నానే వరకు అలానే ఉండనివ్వాలి. ఇలా 10 నిమిషాల పాటు ఉంచిన తరువాత వేడి నీటితో కడిగి వేయాలి. అంతేకాకుండా ఈ నిమ్మకాయ రసానికి దోసకాయ రసాన్ని కూడా కలిపి ప్రభావిత ప్రాంతాలకు పూయండి. ఈ మిశ్రమం ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుంది. మీ చర్మం పైన ముడతల వలన కలిగే మరకలను తొలగించటానికి ఇది ఒక్క చక్కటి మార్గం. బంగాళదుంప రసంలో ఉండే విటమిన్స్ మరియు మినరల్స్ వలన చర్మంలోని నిర్జీవ కాణాలు త్రోలగింపబడి, నూతన కణాలు మరియు ఆరోగ్యవంతమైన పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: