సరైన స్థాయిలో నీటి సేకరణ లేకపోవటం, తక్కువ భౌతికకార్యాలు మరియు ఫైబర్ ఆధారిత ఆహారాలు మాత్రమే కాకుండా, కొన్ని రకాల ఆహార పదార్థాల సేకరణ వలన కూడా మలబద్దకం కలుగుతుంది. ఆ ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది. శరీరంలో విధులు సరిగా నిర్వహింపబడట్లేదని తెలిపే సుచికే మలబద్దకం. ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం, భౌతిక కార్యాలను తక్కువగా జరపటం వలన, సరైన స్థాయిలో నీటిని తాగకపోవటం వలన మలబద్దకం కలుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా, కొన్ని రకాల ఆహార పదార్థాల్ సేకరణ వలన కూడా మలబద్దకం కలుగుతుంది.


పాల లేదా వాటి ఉత్పత్తుల సేకరణ వలన కొంత మందిలో మలబద్ధకం మరియు ఇతర సమస్యలను కలుగుతాయి. అధిక మొత్తంలో పాల ఉత్పత్తులను తీసుకోవటం వలన జీర్ణ సమస్యలు కలుగుతాయి. కావున, మీరు కానీ ఈ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మాత్రం వీటి సేకరణను తగ్గించండి. వీటికి బదులుగా ఫైబర్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోటానికి ప్రయత్నించండి.


వైట్ లేదా బ్రౌన్ ఏ రకం బ్రెడ్ అయిన, శరీరంలో ఇవి గ్రహింపబడవు. దీని ఫలితంగా, కోలన్ లో బ్య్తాక్తీరియా పరమాణువులు (ఫ్రక్టోస్ యొక్క పాలిమర్ పరమాణువులు )చేరి మలబద్దాన్ని కలుగ చేస్తాయి. కావున వీటి వాడకాన్ని తగ్గించండి. మలబద్దకాన్ని కలుగచేసే ఆహార పదార్థాలలో అరటిపండు మొదటి స్థానంలో ఉంటుందని “యూరోపియన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ & హెపాటాలజీ” వారు కనుగొన్నారు. ఈ అరటిపండులో, అధిక మొత్తంలో పిండిపదార్థాలు ఉంటాయి కావున వీటిని తినటం వలన మలబద్దకం కలుగుతుంది. వీటిలో ఉండే టానిన్ లు, పేగులో సమస్యలను కలుగ చేస్తాయి.


రెడ్ మీట్ నేరుగా మలబద్దకాన్ని కలుగ చేయదు. కానీ, ఎక్కువ సమయం పాటూ తినటం వలన మలబద్దకాన్ని కలుగ చేయటంలో దోహదపడుతుంది. ఈ మాంసం జీర్ణం అవటానికి ఎక్కువ సమయం పడుతుంది అంతేకాకుండా, పొట్ట నిండిట్టుగా అనిపిస్తుంది. మలబద్దకం కలగకుండా ఉండటానికి, ఈ మాంసానికి బదులుగా అధిక ఫైబర్ లు గల ఆహారాలను తినండి.


ఫ్రై చేసిన ఆహారాలు జీర్ణాశయంలో నెమ్మదిగా కదులుతుంటాయి. ఈ ఆహారాలు జిడ్డుగా ఉండి, జీర్ణం అవటానికి చాలా సమయం పట్టడం వలన మలబద్దకం కలుగుతుంది. మలబద్దకం కలిగి ఉన్న వారు ఈ ఆహారాలను తినటం వలన మలబద్దకం అధికమవటమే కాకుండా, జీర్ణాశయ భాగాలను గాయాలకు గురి చేస్తాయి. అలాగే మ‌ట‌న్ లాంటి ప‌దార్ధాలు కూడా జీర్ణం అవ్వ‌డం చాలా క‌ష్టంగా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: