కరోనా వైరస్ ప్రస్తుతం ఈ పేరు వింటేనే  ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తిపోతున్నారు. చైనాలోని వుహాన్  నగరంలో గుర్తించబడిన ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రస్తుతం చైనాలో ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి వెయ్యి మందికి పైగా మరణించగా 45 వేల మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు.ఈ వ్యాధిని  తగ్గించేందుకు సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో ఈ వైరస్ సోకితే ప్రాణం పోవడం ఖాయం గా మారిపోయింది.దీంతో  చైనా ప్రజలందరూ ఏమీ చేయలేని స్థితిలో ప్రాణాంతకమైన వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాణభయంతో బతుకును వెళ్లదీస్తున్నారు. మిగతా దేశాలు కూడా తమ దేశాల పరిధిలోకి కరోనా  వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. 

 

 

 ముఖ్యంగా కొన్ని దేశాల్లో అయితే చైనా దేశానికి వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసాయి. ఇక కొన్ని దేశాల ప్రభుత్వాలు తమ దేశ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇతర దేశాల నుంచి తమ దేశానికి వస్తున్న ప్రయాణికులు అందరిని విమానాశ్రయాల లోనే వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం దేశంలోకి అనుమతిస్తున్నారు. అంతేకాకుండా కరోనా  వైరస్ సోకింది అంటూ వస్తున్న వదంతులను కూడా నమ్మొద్దని  వైద్య పరీక్షల అనంతరం నిర్ధారణ అయిన తర్వాతనే నమ్మాలని  సూచిస్తున్నారు. ఆయా  దేశాల ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇప్పటికే ఈ వైరస్ పలు దేశాలకు వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. 

 

 

 ఈ క్రమంలోనే ఉత్తర కొరియాలో ఓ వ్యక్తీకి కరోనా  వైరస్ సోకింది. అయితే దీనికి ఉత్తర కొరియా ప్రభుత్వం విధించిన శిక్ష చూస్తే ఖంగు  తినాల్సిందే. ఉత్తర కొరియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. చైనా నుంచి తాజాగా ఉత్తర కొరియా కు వచ్చిన అధికారికి కరోనా... లక్షణాలు కనిపించడంతో అతడిని ప్రజల మధ్య తిరగకుండా గృహనిర్బంధం చేశారు.  అయితే ప్రభుత్వం విధించిన నిబంధనను అతిక్రమించి.. ప్రజల మధ్యకు కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి రావడంతో.. అతని గమనించిన భద్రత సిబ్బంది అక్కడికక్కడే కాల్చిచంపారు. తమ దేశంలో ప్రాణాంతకమైన కరోనా  వైరస్ సోకకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: