మహిళలపై రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. రోడ్లపై ఉండే  పోకిరీలు అత్యాచారాలకు పాల్పడుతున్నారని మహిళలు ఇంట్లో ఉంటే రక్షణ ఉంటుందని నమ్ముకుంటే. ప్రస్తుతం మహిళలకు ఇంట్లో కూడా రక్షణ కరువైంది. కన్నవారే  కామంతో కాటేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచి అయ్య చేతిలో పెట్టాల్సిన నాన్న.. కామంతో కళ్లు మూసుకుపోయిన అత్యాచారాని పాల్పడుతున్నారు... అండగా ఉండి సమస్యలనుంచి రక్షించాల్సిన అన్న... సమస్య గా మారుతున్నాడు. ఈ రోజుల్లో వావివరుసలు మరచి ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లలా  మారి అత్యాచారం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు  రోజుకు ఒకటి  తెర మీదకు వస్తున్నాయి. 

 

 

 ఇలాంటిదే మరొకటి తెరమీదికి వచ్చింది. కామంతో కళ్లుమూసుకు పోయిన కన్నతండ్రి కూతురిని బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ మానిపించడం తో ఇంట్లో ఉంటున్న 13 ఏళ్ల కూతురుపై కామం పెంచుకున్నాడు ఇక్కడొక కసాయి తండ్రి. కూతురు గొంతు పై కత్తి పెట్టి దారుణంగా రేప్ చేశారు. ఎప్పుడు గంజాయి  మత్తులో ఉండే  ఆ కసాయి తండ్రి పలుమార్లు ఆ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని కూతురును బెదిరించేవాడు. ఈ ఘటన గురుగ్రామ్ లో  చోటు చేసుకుంది. తన చర్యలతో భయపడిపోయిన బాలిక జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేక మౌనంగానే భరించలేదు. రోజురోజుకి తండ్రి  వేధింపులు ఎక్కువ అవుతుండడంతో ఓ రోజు ధైర్యం చేసి పని నుంచి వచ్చిన తల్లికి విషయాన్ని చెప్పి బోరున విలపించింది. ఇక  కూతురు జీవితాన్ని నాశనం చేసిన మొగుడిని సహించని భార్య  పోలీసులను ఆశ్రయించింది. 

 

 

 తన కూతురు గొంతుపై కత్తి పెట్టి బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని అంతేకాకుండా కొడుకును కూడా కత్తితో గాయపరుచినట్లు ఫిర్యాదులో పేర్కొంది సదరు మైనర్ బాలిక తల్లి. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురుగ్రాం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వావివరుసలు మరచి కామంతో ఊగిపోయి కన్నకూతురిపై దానికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. నిందితుడి పై పోక్సో చట్టం లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: