ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితా ల్లో  బీజేపీకి ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే.కేంద్రంలో  చక్రం తిప్పుతున్న బిజెపి పార్టీకి దేశ రాజకీయాలకు కేంద్ర బిందువైన రాజధాని ఢిల్లీలో మాత్రం తమ సత్తా చాటారు లేకపోయింది, బిజెపి ఎన్ని వ్యూహాలు వేసినప్పటికీ సామాన్యుడు పార్టీ ముందు సత్తా చాట లేకపోయింది  బీజేపీ పార్టీ.70 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 8 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత మూడు ఎలక్షన్ లో నుంచి ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్నో కలలు కంటున్న బీజేపీకి ఈసారి కూడా అది కలగానే మిగిలిపోయింది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరిస్తునట్లు  హోంశాఖ మంత్రి అమిత్షా పేర్కొన్నారు. ఎన్నికల్లో తమ అంచనా తప్పింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

 

 

 టైమ్స్ నౌ సమ్మిట్లో గురువారం మాట్లాడిన అమిత్ షా... ఢిల్లీలోని కొంతమంది బీజేపీ నేతల వ్యాఖ్యల కారణంగా ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ ఎంతగానో నష్టపోవాల్సి వచ్చింది అంటూ ఆయన తెలిపారు. దేశద్రోహులను కాల్చేయండి లాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు అమిత్ షా . అంతే కాకుండా దేశవ్యాప్తంగా నిరసనకు కారణమైన పౌరసత్వ సవరణ చట్టం  గురించి ఎవరైనా తనతో చర్చకు రావాలంటూ  ఆయన తెలిపారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఉగ్రవాదిగా వ్యాఖ్యానిస్తూ బీజేపీ నేతలు పలు విమర్శలు చేశారు. అంతేకాకుండా సీఎఏ కు  వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనగా పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేతలు. అయితే అటు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా ఇతర పార్టీలపై విమర్శలు చేయకుండా... ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను  ప్రజల్లోకి తీసుకెళ్లడం లోనే ఎక్కువ దృష్టిపెట్టి విజయం సాధించారు. 

 

 

 అయితే మరోసారి కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ పార్టీ హస్తినలో సింగిల్ డిజిట్ కే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం ఎనిమిది అంటే ఎనిమిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది బిజెపి పార్టీ. బిజెపి ఎన్ని వ్యూహాలు వేసినప్పటికీ కేజ్రీవాల్ వైపే ఎక్కువ మొగ్గు చూపారు హస్తిన ప్రజలు. ఎన్నికల ఫలితాలు విడుదలైనా పది నిమిషాల్లోనే ఎవరు అధికారాన్ని దక్కించుకో నున్నారు  అని స్పష్టంగా అర్థమైంది. ఫలితాలు విడుదలైనా పది నిమిషాల్లోనే మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో  కేజ్రీవాల్ చీపురు పార్టీ ముందంజలో ఉండి  కమలాన్ని ఊడ్చేసింది. ఇక ఈ విషయంతో కేజ్రీవాల్ హాట్రిక్ సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: