చంద్రబాబు కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. 2019 ఎన్నికల భయంకరమైన ఓటమితో ముక్కుతూ మూలుగుతూ తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ ఎదుర్కొనటానికి అనేక వ్యూహాలు పన్నుతున్నారు. ఇంగ్లీష్ మీడియం మరియు మూడు రాజధానుల విషయం ఇలాగా అనేక విషయాలలో జగన్ సర్కార్ పై వ్యతిరేకత తీసుకురావాలని భావించిన ఎక్కడా కూడా పని కాలేదు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కూడా తమ రాజకీయ భవిష్యత్తు గురించి అభద్రతాభావంతో ప్రస్తుతం ఉన్నట్లు సమాచారం. ఏ క్షణాన్నైనా తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే పరిస్థితిలో నెలకొనటంతో చంద్రబాబు పార్టీని మరింతగా పైకి తీసుకురావటం కోసం అనేక ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నారు.

 

వీటిలో భాగంగా దేశంలోనే ఎన్నికల వ్యూహకర్త గా మంచి పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ తో పనిచేయాలని చంద్రబాబు తాజాగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. మనకందరికీ తెలిసినదే గత సార్వత్రిక ఎన్నికల ముందు వైసిపి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టారు. అదే సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో చేతులు కలిపారు. జగన్ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు 2019 ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ప్రశాంతి కిషోర్ ని రంగంలోకి దింపి పార్టీ తరఫున భారీ డబ్బు ఆఫర్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం చంద్రబాబు తో పని చేయడానికి ఇష్టపడటం లేదన్నట్టు..ముఖ్యంగా జగన్ తో పని చేసిన సందర్భంలో బాబుకి అండగా ఉండే మీడియా తనపై ప్రసారం చేసిన కథనాల విషయంలో బాబు వ్యవహరించిన తీరు తనకు అసహ్యం కలిగించడంతో..చంద్రబాబుతో పని చేసే ప్రసక్తే లేదన్న ఆలోచనలో ప్రశాంత్ కిషోర్ ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేని దిక్కుతోచని స్థితిలో కి చంద్రబాబు వెళ్లిపోయినట్లు వార్తలు గట్టిగా టిడిపి పార్టీలో వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: