తాజాగా ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. క‌ర్నూలులో ప‌ర్య‌టించారు. భారీ ఎత్తున జ‌న‌సందోహం ఎ ప్ప‌టిలాగానే వ‌చ్చి చేరింది. ప‌వ‌న్ నువ్వే సీఎం.. అంటూ నినాదాల‌తో హోరెత్తించింది. ఇక ఈ స‌మ యం లో 2017లో నగరంలోని కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతిపై పవన్ గళ మెత్తారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ప‌వ‌న్ మాట్లాడిన మాట‌ల్లో కేవ‌లం ఆవేశ‌మే త‌ప్ప‌.. క్లారిటీ క‌నిపించ‌లేద‌నేది ప్ర‌దాన విమ‌ర్శ‌. స‌హ‌జంగానే జ‌నాల‌ను చూడ‌గానే ఎలాంటి నాయ‌కుడికైనా కూడా ఆవేశం వ‌స్తుంది. అదేస‌మ‌యంలో మాట‌లు కూడా త‌డ‌బ‌డ‌తాయి.

 

కానీ, ప‌వ‌న్ విష‌యంలో ఇది స‌ర్వ‌సాధార‌ణం క‌దా! ఆయ‌న స‌బ‌ల‌కు యువ‌కులు, జ‌నం రాక‌పోతేనే వార్త‌. మ‌రి అలాంటి వారిని చూసి ప‌వ‌న్ త‌డ‌బ‌డ‌డం ఏంటి? అనేది కీల‌క ప్ర‌శ్న‌. స‌రే! ఇంత‌కీ ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నిస్తే..

 

1.  అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయడానికే తాను ఇక్కడకు వచ్చానని అన్నారు. బాలిక అత్యాచారానికి గురై చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో స్పష్టంగా ఉన్నా నిందితులను ఎందుకు శిక్షించడం లేదని ప్రశ్నించారు. నిందితులు బలవంతులు అవడం వల్ల వారిని శిక్ష నుంచి తప్పించ డానికి పోలీసులు, వ్యవస్థలు పనిచేస్తున్నాయని, అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

 

మిస్స‌యిన క్లారిటీ: ఆల్రెడీ నిందుతులు  ఏం చేశార‌న్నది స్ప‌ష్టంగా ఉంద‌ని పోస్టు మార్టం రిపోర్టులో ఉంద‌ని చెబుతూనే ఈ కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని కోర‌డం చిత్రంగా ఉంది. ఇక‌, త‌ను రావ‌డం వ‌ల్లే న్యాయం జ‌రిగితే.. ఇక‌, ఎక్క‌డ నేరం జ‌రిగితే.. అక్క‌డ‌కు ప‌వ‌న్ వెళ్తే స‌రిపోతుంది. పోలీసులు, కోర్టులు అవ‌స‌రం లేదు. ఈ విష‌యంలో క్లారిటీ మిస్‌.

 

2.  పక్క రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే మన రాష్ట్రంలో దిశ చట్టం తీసుకువచ్చారని, దిశ కంటే ముందే ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అనేక అత్యాచారాలు, హత్యలు జరిగినా ఇలాంటి చట్టాలు ఎందుకు తీసుకురాలేదని  ప్రశ్నించారు.

 

క్లారిటీ మిస్‌:  దిశ కంటే ముందే.. రాష్ట్రంలో జ‌రిగిన హ‌త్య‌లు.. అత్యాచారాలు.. చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగాయి. అప్ప‌ట్లో ఎందుకు చ‌ట్టం తీసుకురాలేద‌ని జ‌గ‌న్‌ను అడిగితే ఏం లాభం?  కొంచెం క్లారిటీ ఉండ‌క్క‌ర్లా?!

 

3. కర్నూలులోనే విద్యార్థి కుటుంబానికి న్యాయం జరగనప్పుడు జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ తీసుకువచ్చి ప్రయోజనం ఉండదని అన్నారు. కర్నూలుకు హైకోర్టు  మాత్రమే కాదు నీరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కావాలని అన్నారు.

 

క్లారిటీ మిస్‌: ఒక కుటుంబానికి న్యాయం జ‌ర‌గ‌నంత మాత్రాన కోర్టులే వ‌ద్ద‌నేలా వ్యాఖ్యానించ‌డం క్లారిటీ మిస్ చేసుకున్న‌ట్టే. అదేస‌మ‌యంలో ఒక‌ప‌క్క హైకోర్టు వ‌ద్దంటునే.. మ‌ళ్లీ కావాల‌ని అదే నిముషంలో మాట మార్చ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల్లోనూ క్లారిటీ లేకుండా పోతోంది. మ‌రి ప‌వ‌న్ ఇలా ఒక్క ప్ర‌సంగంలోనే ఇన్ని క్లారిటీలు మిస్స‌యితే ఎలా? అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: