ఏదో అనుకుంటే...ఇంకేదో జరిగిందే అన్నట్లుగానే చంద్రబాబు కథ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లే కనిపిస్తుంది. గత ఐదేళ్లు అధికారంలో ఉండి బాబు అండ్ కొ చేసిన తప్పులు ఇప్పుడు నిదానంగా బయటపడుతున్నాయి. అధికారం అడ్డం పెట్టుకుని తన సన్నిహితులకు ఏ విధంగా దోచిపెట్టారో అనే విషయం ఇన్‌కమ్ టాక్స్ అధికారులు ద్వారా తాజాగా బయటపడింది. ఇటీవల బాబు మాజీ పర్సనల్ సెక్రటరీ  శ్రీనివాస్ ఇంటిపై ఐదు రోజుల పాటు ఐటీ శాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే.

 

ఈ క్రమంలోనే సరైన ఆధారాలు చూపించలేక మాజీ పీఏ శ్రీనివాస్ అప్రూవర్ గా మారడంతో కీలక సాక్ష్యాలు ఐటీశాఖకు లభించాయని తెలుస్తోంది. ఇక శ్రీనివాస్‌తో పాటు బాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కంపెనీలు, ఇళ్లపై కూడా ఐటీ శాఖ దాడులు జరిగాయి. అక్కడ కూడా ఐ‌టి అధికారులు కీలక ఆధారాలు సేకరించారని వార్తలు వచ్చాయి. అయితే ఏ విధంగానైనా చంద్రబాబు సన్నిహితులు దాదాపు రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఐటీ శాఖ స్వయంగా చెప్పడంతో, బాబు పునాదులు కదలడం మొదలయ్యాయి.

 

కాకపోతే ఐటీ శాఖ తన ప్రకటనలో పూర్తిగా పేర్లు చెప్పనప్పటికీ ఐటీ దాడులు జరిగిన ఇల్లు, ఆఫీసులు బాబు సన్నిహితులేవే అన్న విషయం క్లియర్ కట్‌గా అందరికీ తెలుసు. ఇక దీని బట్టి చూసుకుంటే బాబు కూడా అడ్డంగా బుక్ అయిపోయే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతానికి ఆధారాలు సేకరించిన ఐటీ వారు, వాటి లోతుల్లోకి తేల్చేందుకు సిద్ధమయ్యారు. అసలు వీరు ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారనే తీగ లాగితే బాబు డొంక కదిలే ఛాన్స్ ఉంది.

 

పైగా పదేళ్లుగా చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు గత ఐదేళ్ల సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ ఆస్తులు సంపాదించినట్లు  తెలుస్తోంది. ఓ రకంగా ఆయన చంద్రబాబుకు బినామీగా వ్యవహరించారని ప్రచారం కూడా ఉంది. ఇక ఇలాంటి పరిస్తితుల్లో శ్రీనివాస్‌పై ఐ‌టి దాడులు చేయడం వల్ల, బాబు కూడా రిస్క్‌లో పడ్డట్లే. అన్నీ ఆధారాలు రుజువైతే బాబు కూడా జైలుకు వెళ్ళడం ఖాయమని పోలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: