ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ నిధుల కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి గత ఆరు సంవత్సరాల నుండి ఎంత కేటాయించిన దో లెక్క చెప్పాలి అంటూ ప్రశ్నించారు. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గత ఆరు సంవత్సరాలుగా ఏ రాష్ట్ర ప్రభుత్వ ఇవ్వని నిధులు తెలంగాణ రాష్ట్రానికి లక్షన్నర కోట్ల వరకు ఇచ్చినట్లు కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ తెగువ చూపించి మరి కేంద్రాన్ని తన ప్రశ్నలతో కడిగిపారేశారు. దేశవ్యాప్తంగా పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక శాతం తెలంగాణ ప్రభుత్వం నుండి వెళుతున్నట్లుగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం 2.72 లక్షల కోట్లను చెల్లించినట్లు గా కేటీఆర్ తెలిపారు. ఇంత భారీ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్రానికి పన్నులు కడితే తమ రాష్ట్రానికి కేంద్రం నుండి నిధుల రూపంలో వచ్చింది రూ.1.12లక్షల కోట్లు మాత్రమేనని చెప్పారు. కేంద్రం నుండి తక్కువ నిధులు వాటా కూడా తక్కువ రావడంతో తీవ్ర ఆవేదనకు గురైన కేటీఆర్..తెలంగాణ రాష్ట్రానికి అధిక నిధులు ఇచ్చామని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఎలా చెబుతారని ఫుల్ సీరియస్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రానికి ఏ మేరకు నిధులు ఖర్చవుతున్నాయి అన్ని లెక్కలు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని గట్టిగా పిలుపునిచ్చారు.

 

దీంతో కేంద్ర ప్రభుత్వాన్ని కడిగిపారేసిన కేటీఆర్ తెగువ చూసి...కెసిఆర్ కూడా షాక్ అయ్యారట. ఈ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే రాబోయే రోజుల్లో కచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేలా కేంద్రంలో ఉన్న పెద్దలు వ్యవహరిస్తారని...ఏం మాట్లాడకుండా ఉంటే చాలా చిన్న చూపు చూసినట్టుగా సౌత్ రాష్ట్రాలను చూస్తున్నారని పార్టీ నాయకులతో కెసిఆర్ అన్నట్టుగా సమాచారం. మొత్తం మీద కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కడిగిపారేసిన విధానాన్ని ప్రశ్నలకు కెసిఆర్ కూడా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పట్ల ఈ విధంగానే వ్యవహరించాలని పార్టీ నాయకులకు సూచించారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: