భూమా అఖిలప్రియ రెడ్డి.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి మరణంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే అయినా అఖిలమ్మ.. తండ్రి మరణంతో మంత్రి అయ్యింది. అమ్మ మరణించినప్పుడు వైసీపీలో ఉన్న అఖిలప్రియ.. అనంతరం పార్టీ మరి టీడీపీలో చేరారు. టీడీపీ హయాంలో మంత్రి అయినా అఖిల ప్రియా 2019 ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓటమిని చవిచూశారు. 

 

అలాంటి ఈ మాజీ మంత్రి అఖిలప్రియ ప్రేమ కథ గురించి మీకు తెలుసా? అప్పుడెప్పుడో అఖిలప్రియ రెండో పెళ్లి సమయంలో ఆమె గతం గురించి.. ఆమె మాజీ భర్త గురించి.. ఆమె ప్రేమ కథ గురించి యూట్యూబ్ లో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. అప్పట్లో ఆ స్టోరీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా.. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రేమికుల రోజు కావడంతో.. రాజకీయ నాయకులు.. నాయకురాల ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఎవరు అని చూస్తే.. అఖిలప్రియ ప్రేమ కథ యూట్యూబ్ ద్వారా బయటపడింది. ఆమె మాజీ భర్త గురించి.. రెండో భర్త ప్రేమ కథ గురించి  సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు వైఎస్ జగన్ మామ అయినా రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడితో పెళ్లి చేశారు.. అయితే వారి ఇద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు రావడంతో పెళ్ళైన ఏడాదికే భర్తతో విడిపోయి పుట్టింటికి చేరింది అఖిలమ్మ. అలా చేరిన అఖిలప్రియకు తల్లితండ్రుల మరణంతో రాజకీయంగా 5 ఏళ్ళు స్టార్ లా ఎదిగిపోయింది. 

 

అయితే ఇలా రాజకీయంగా స్టార్ అయినా అఖిలప్రియ వ్యక్తిగత జీవితాన్ని అందంగా మార్చుకోవాలని.. భార్గవ్ రామ్ నాయుడు అనే వ్యక్తిని ప్రేమించి 2017లో పెళ్లి చేసుకుంది. ఈ  భార్గవ్ రామ్ నాయుడును 5 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే  భార్గవ్ రామ్ నాయుడు పారిశ్రామకవేత్త.. ఇతనికి కూడా గతంలోనే పెళ్లి జరిగింది. అది కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది అయినా ఏపీ మాజీ డీజిపి సాంబశివరావు గారి కూతురితో వివాహం అయింది.. అయితే మొదట ఆమెతో బాగున్నా భార్గవ్ రామ్ తర్వాత విడిపోయాడు.. అలా భార్యకు దూరమైనా భార్గవ్ రామ్.. భర్తకు దూరమైనా భార్య భూమా అఖిలప్రియ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇదేనండి అఖిలమ్మ ప్రేమ కథ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: