ఆంధ్రప్రదేశ్ విపక్ష తెలుగుదేశం పార్టీ తెలుగుదేశంలో ఉన్న ముగ్గురు ఎంపీల తీరు ఎవరి దారి వారిదే అన్నట్టు ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయినా సరే తనకు పట్టున్న గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం ఎంపీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. కేసినేని నానీ, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ముగ్గురు కూడా బలమైన నేతలే. అయితే గెలిచిన తర్వాత కొంత కాలం పాటు చంద్రబాబుకి అండగా ఉన్న ముగ్గురు ఎంపీలు ఇప్పుడు మాత్రం దూరంగా ఉన్నారని అంటున్నారు. 

పార్లమెంట్ సమావేశాల్లో ఈ ముగ్గరు ఎంపీలు కూడా ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు కేంద్ర మంత్రులతో సావాసం చేయమని చెప్తే, వీరు ముగ్గురు ఎవరికి నచ్చిన వారితో వారు సావాసం చేస్తూ తమ పరిచయాలను పెంచుకునే క్రమంలో పార్టీని విస్మరించినట్టు సమాచారం. ఇద్దరి దారి ఇప్పుడు అలాగే ఉందని, ఒక ఎంపీ గారు మాత్రమే చంద్రబాబు ఆదేశాలను పాటిస్తున్నారని అంటున్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడొద్దు అని చెప్తుంటే వాళ్ళు ఆ అంశాన్ని ఏదో వైసీపీని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడాలని చూస్తున్నారు. 

ఇప్పుడే మోడీకి దగ్గరవుదామని చూస్తున్న చంద్రబాబుకి ఈ పరిణామం తల నొప్పిగా మారింది. రాజకీయంగా ఇప్పుడు చంద్రబాబు బలపడాలి అంటే కేంద్రం మద్దతు అనేది తప్పనిసరి కావాల్సి వచ్చింది కాబట్టి కేంద్రంతో సయోధ్య అనేది చాలా అవసరం. కాని ముగ్గురు ఎంపీలు ఢిల్లీలో ఉంటూ తనను, పార్టీని మర్చిపోయి వాళ్ళ దారిలో వాళ్ళు ఉన్నారని, ఒక పక్క అధికార పార్టీలో ఉన్న 22 మంది జగన్ మాట వింటుంటే, ఇక్కడ ఉన్న ముగ్గురు కూడా తన మాట వినడం లేదనే భావన చంద్రబాబులో వ్యక్తమవుతుంది.దీనితో ఇప్పుడు చంద్రబాబు ఒక్కో ఎంపీతో నేరుగా మాట్లాడి వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: