ఇన్నాళ్ళు తాము చెప్పిందే రాజకీయం, చేసిందే రాజకీయం, అన్నట్టు భావించిన ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాకు ఇప్పుడు సినిమా అర్ధమైందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. 303 స్థానాలతో రెండో సారి ప్రధాని అయిన నరేంద్ర మోడికి మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్, ఢిల్లీ ఎన్నికలు ఒక దాని తర్వాత ఒకటి చుక్కలు చూపించాయి. ఒక్క హర్యానాలో మినహా బిజెపి ఎక్కడా అధికారంలోకి రాలేదు. దీనితో ఇప్పుడు మోడిషా ఆత్మరక్షణలో పడిపోయారు. వాస్తవానికి కాంగ్రెస్ ముక్తభారత్ అని ప్రకటించింది బిజెపి. 

ఆ ప్రకటన చేసిన ఏడాది లోపే 6 రాష్ట్రాలను కాంగ్రెస్ లేదా దానితో ప్రత్యక్షంగా పరోక్షంగా స్నేహం చేసే పార్టీలకు వదులుకుంది. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో గెలిచి పరువు నిలుపుకుందామని భావించిన ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇక్కడ కామెడి ఏంటీ అంటే, దేశ భక్తి పేరుతో బిజెపి కొత్తగా మొదలుపెట్టిన పౌరసత్వ సవరణపై ప్రకటన చేసిన తర్వాత బిజెపి కోల్పోయిన రాష్ట్రాలు రెండు. ఢిల్లీలో హిందు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంటుంది. అక్కడ కూడా ఆ పార్టీ విజయం సాధించలేదు. షాహీన్ బాగ్ ఉన్న ఒక్లాలో దారుణంగా ఓడిపోయింది బిజెపి. 

దీనితో ఇప్పుడు మోడీ షా ఆత్మరక్షణలో పడిపోయారు. ఎం చెయ్యాలి అనే దాని మీద ఇప్పుడు మళ్ళీ సీనియర్లను సంప్రదిస్తున్నారు. కీలక బిల్లులను ఆమోదించుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఇప్పుడు ఎంతైనా ఉంది. ప్రాంతీయ పార్టీలను చంపాలని చూసిన మోడిషా ఇప్పుడు వాటితో స్నేహం చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలను గెలిచిన ఆ పార్టీ, 7 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. బీహార్ లో కూడా ఓడిపోయే అవకాశం ఉంది. వచ్చే ఏడాది బెంగాల్ లో కూడా గెలిచే పరిస్థితి ఎంత మాత్రం లేదు. కాబట్టి ఇప్పుడు బిజెపి ముందు దేశభక్తి అనే దారి మూసుకుపోయినట్టే దీనితో ఆ ఇద్దరు ఎం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రాంతీయ పార్టీలు కూడా బిజెపితో స్నేహం చేసే పరిస్థితి కనపడటం లేదు. కెసిఆర్, జగన్ లాంటి బలమైన నేతలు కూడా బిజెపికి దూరంగా ఉంటేనే మంచిది అనే భావనలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: