ఎక్కడైనా వెళ్లాలంటే ఎవరినైనా కలిసి అడ్రెస్స్ తెలుసు కోవడం లేదా చూపించ గలరా అని అడిగేవారు.. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది..స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుండి అన్నీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటున్నారు..గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చిన గూగుల్ మ్యాప్ సహాయంతో ఎక్కడికి వెళ్ళలనుకున్న వెళ్లాల్సిన ప్రదేశాన్ని అడిగితే చాలు మనకు అతి తక్కువ సమయంలో అడ్రెస్స్ ను చూపిస్తుంది.. ఇలానే గూగుల్ మ్యాప్ పై చాలా మంది ఆధారపడ్డారు..

 

 

గూగుల్’ సెర్చ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బద్దకం మరింత పెరిగిపోయింది. కనీసం బుర్రపెట్టి ఆలోచించకుండా అది ఏం చెబితే.. అదే నిజమని నమ్మేస్తున్నారు. ఇక గూగుల్ మ్యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కనీసం అడ్రస్‌లు కూడా గుర్తుపెట్టుకోకుండా.. దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. ఇందుకు అమెరికాలో జరిగిన ఈ చిత్రమైన ఘటనే నిదర్శనం.మిన్నియాపాలిస్‌లో ఓ యువకుడు నదికి అవతల ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లేందుకు గూగుల్ మ్యాప్‌ను అనుసరించాడు. అది చూపించిన దారిలో నడుస్తూ నేరుగా గడ్డకట్టిన మిస్సిస్సిపీ నదిలోకి వెళ్లాడు. 

 

 

అలా ఆ నదిలో  ముక్కలు కావడంతో నదిలో పాక్షికంగా మునిగిపోయాడు. అటుగా వెళ్తున్న కొందరు అతడిని రక్షించే ప్రయత్నం చేశారు.వారి వల్ల సాధ్యం కాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరిన రెస్క్యూ టీమ్ అతడిని రక్షించి హాస్పిటల్‌కు తరలించారు.గూగుల్ మ్యాప్‌లో చూపించిన దారిలో నడవడం వల్లే తాను నదిలో చిక్కుకున్నానని బాధితుడు తెలిపాడు. 

 

 

సీబీసీ’ వార్తా సంస్థ కథనం ప్రకారం.. వాస్తవానికి అతడు గమ్యం చేరాలంటే.. స్టోన్ ఆర్క్ బ్రిడ్జ్‌ను దాటాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా గూగుల్ అతడిని నదిని దాటి వెళ్లాలని చెప్పిందే గానీ, నదిలో నుంచి వెళ్లమని చెప్పలేదని.. అతడు పొరపాటును ఆ మార్గంలో వెళ్లి ఉంటాడని పేర్కొంది.ఇటీవల ఓ యువకుడు 99 స్మార్ట్ ఫోన్లు ఉపయోగించి గూగుల్ మ్యాప్స్‌లో ట్రాఫిక్ జామ్‌ను సృష్టించాడు. వాటిని చూసిన వ్యక్తులు ఆ మార్గంలో నిజంగానే ట్రాఫిక్ జామ్ అయ్యిందని భావించారు. కాబట్టి.. టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడటం కూడా మంచిది కాదు. అప్పుడప్పుడు మన బుర్రను కూడా ఉపయోగించడం ఉత్తమం.అని పోలీసులు హెచ్చరిస్తున్నారు..గూగుల్ మ్యాప్ వాడుతున్న ట్లయితే జాగ్రత్త సుమీ...

 

మరింత సమాచారం తెలుసుకోండి: