మొన్న ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ అతి ఘన విజయం వెనుక ప్రధాన పాత్ర పోషించింది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నది అందరికీ తెలిసిన సత్యం. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మరియు చివరి దశలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రతిపక్షం ఊపిరి సలపకుండా కేజ్రీవాల్ మరియు ప్రశాంత్ కిషోర్ అత్యద్భుతంగా రాజకీయం చేశారు. దాంతో స్టాలిన్, మమతా బెనర్జీ లాంటి ప్రముఖ జాతీయ నాయకుల కన్ను ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పై పడింది.

 

ప్రస్తుతం బెంగాల్ లో ఎన్నికలు దగ్గరకు రానుండడంతో మమత ఇటీవల ప్రవేశపెట్టిన తన బడ్జెట్ లో ప్రశాంత్ కిషోర్ సహకారంతో కొన్ని కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీలో కేజ్రీవాల్ 200 యూనిట్ల కరెంటు కన్నా తక్కువ వాడిన వారికి కరెంటు పూర్తిగా ఉచితం మరియు 400 యూనిట్లు కన్నా తక్కువ అని వారికి మామూలు చార్జీలు అని ప్రవేశపెట్టిన తీరు సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మమతా కూడా తన రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ సూచనలతో ఇలాంటి కొత్త పాలసీలకు శ్రీకారం చుట్టింది.

 

 

అయితే ప్రశాంత్ కిషోర్ కనీసం 100 యూనిట్ల వరకైనా కరెంటు ఉచితంగా ఇవ్వమని ఆమెకు సలహా ఇస్తే అలా కుదరదు అని చెప్పి తను మూడు నెలలకు గాను 75 యూనిట్లు కన్నా తక్కువ కరెంటు వాడిన వారికి మాత్రమే ఉచితం అని ప్రకటించింది. కేవలం కలకత్తా మహా నగరం చుట్టుపక్కల ఉన్న మురికివాడలు వారికి తప్పించి మామూలు పేదవారు కూడా అంత తక్కువ కరెంట్ వాడే అవకాశం లేదు. ఇకపోతే వృద్ధులకు కూడా వెయ్యి రూపాయల పింఛను ఇచ్చే లాగా ఉచిత సంక్షేమ పథకాన్ని ప్రకటించిన మమత కేజ్రీవాల్ లాగా సక్సెస్ అవుతుందా లేదా చంద్రబాబుకు ఆంధ్రరాష్ట్రంలో జరిగినట్టు ఇవన్నీ తిరిగి ఆమెకు ఎదురు దెబ్బ తగులుతాయా అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: