చంద్రబాబునాయుడు దగ్గర పిఎస్ గా  పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ దగ్గర దొరికిన డైరీలే కొంప ముంచేయబోతున్నాయా ? దొరికిన డైరీల్లో సంచలన వివరాలు ఉన్నాయా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఐదేళ్ళు చంద్రబాబు దగ్గర పిఎస్ గా పనిచేసిన కాలంలోనే కాకుండా అంతకుముందు జరిగిన లావాదేవీల వివరాలను కూడా శ్రీనివాస్ ఎప్పటికప్పుడు డైరీల్లో తేదీలతో సహా రాసిపెట్టుకున్నట్లు సమాచారం. అంటే దాదాపు పదేళ్ళ పాటు చంద్రబాబు కేంద్రంగా జరిగిన వ్యవహారాలన్నీ డైరీల్లో ఐటి అధికారులకు దొరికినట్లు సమాచారం.

 

చంద్రబాబుకు దేశంలోని ఏఏ పారిశ్రామిక సంస్ధలతో సంబంధాలున్నాయి ?  నిర్మాణ కాంట్రాక్టు సంస్ధలతో ఉన్న సంబంధాలు ఏమిటి ? ఎవరెవరి దగ్గర నుండి చంద్రబాబుకు ఏ ఏ తేదీల్లో ఎంతెంత డబ్బులు అందాయనే విషయాలు చాలా వివరంగా రాసుకున్నాడట. ఏ ఏ కాంట్రాక్టు సంస్ధలకు ఏ ఏ ప్రాజెక్టులను చంద్రబాబు కట్టబెట్టారన్న వివరాలతో పాటు ప్రతిఫలంగా వాళ్ళ దగ్గర నుండి ఎంతమొత్తంలో డబ్బులు అందాయనే విషయాలు కూడా రాసుకున్నాడట. ప్రధాన కాంట్రాక్టు సంస్ధల నుండి సబ్ కాంట్రాక్టులు తీసుకుని పనులు జరిపినట్లు వివరాలు రాసుకున్నాడు.

 

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  కాంట్రాక్టుసంస్ధలు మాత్రమే వాస్తవం.  పనులు చేసిన  సబ్ కాంట్రాక్టు సంస్ధలు మాత్రం బోగస్ వే. ఎందుకంటే అసలు సబ్ కాంట్రాక్టు పనులు దక్కించుకున్న సంస్ధలే లేవు. ఆ పేరుతో ప్రధాన కాంట్రాక్టు సంస్ధల నుండే కోట్ల లో డబ్బులు వసూలు చేసుకుని హవాలా మార్గంలో విదేశాలకు పంపినట్లు ఉందట.  

 

వీటితో పాటు ఎన్నికల సమయంలో అంటే రాజస్ధాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినపుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు వేల కోట్ల రూపాయలను అందచేసిన వివరాలు కూడా ఉన్నాయట. ఏ రాష్ట్రంలోని పార్టీకి ఎంత డబ్బు పంపింది, ఏ రూపంలో పంపిన విషయం కూడా రాసుకున్నారట. మరి దొరికిన ఆధారలతో శ్రీనివాస్ ను అరెస్టు చేస్తే పెద్ద బాస్ కచ్చితంగా బయటపడతారనటంలో సందేహం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: