గత పది రోజులుగా టీడీపీ నాయకులు టార్గెట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఐటీ సోదాల్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్‌ ఇళ్లు, కార్యాలయాల్లో జరిగిన సోదాల్లో దాదాపు 2 వేల కోట్లకు పైగా అక్రమ లావాదేవీలకు సంబంధించిన విషయం బయటపడింది. షెల్‌ కంపెనీలను సృష్టించి వాటి పేరుతో డబ్బు దారి మళ్లీంచారని, పన్నుల ఎగవేతకు పాల్పడ్డారనీ ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెుంట్‌ వెల్లడించింది. సోదాల్లో దొరికిన లాకర్లు, ఈ మెయిల్స్‌, వాట్సప్‌ మెసేజ్‌లను విశ్లేషించాల్సి ఉంది. అయితే టీడీపీ నేతలు మాత్రం ఐటీ శాఖ చేసిన ప్రకటనను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెపుతున్నారు.

 


టీడీపీ నాయకులు ఆఫ్‌ ద రికార్డ్‌ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ నాయకుడు మాట్లాడుతూ ఐటీ శాఖ విడుదల చేసిన ప్రకటనలో అధికారి సంతకం లేదు. అది బోగస్ అయి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరో నాయకుడు వైసీపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా టీడీపీ నాయకులపై వేదింపులకు దిగుతుందన్నాడు. మా మీద అధికారి పార్టీ వేదింపులకు దిగే అవకాశం ఉందని గతంలోనే చెప్పామని, అదే ఇప్నుడు జరుగుతుందన్నారు. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ వ్యవహారమంతా అధినేత చంద్రబాబు మెడకు చుట్టుకునే అవకావం ఉందన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

 

వైసీపీ నేతల వాదన మరోలా ఉంది. అధికారంలోకి రాకముందు నుంచే టీడీపీ హయాంలో జరిగిన అవినీతి గురించి బల్ల గుద్ది చెబుతున్న వైసీపీ నాయకులు ఇప్పడు అసలు నిజాలు వెలుగు చూస్తున్నాయని చెబుతున్నారు. ఈ సోదాల్లో వెలుగు చూసిన నిజాలు అందుకు సాక్ష్యం అంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్‌ ఇస్తోంది. గతంలో జగన్‌మోహన్‌ రెడ్డి మీద కూడా ఇలాంటి ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలే వచ్చాయి. అంటే అవన్ని కూడా నిజమే అనుకోవాలా అంటున్నారు టీడీపీ నాయకులు.

 

తాజాగా ఐటీ సోదాల్ని ఎదుర్కొన్న టీడీపీ నాయకుడు కూడా పెద్దవి విప్పినట్టుగా తెలుస్తోంది. ఆ నాయకుడు మాట్లాడుతూ.. మాకు చాలా వ్యాపారాలున్నాయి. వాటికి సంబంధించి ఐటీ సోదాలు జరగటం అన్నది పెద్ద విశేషం ఏం కాదు. అన్నింటికీ లెక్కలు ఉన్నాయి. మా మీద దుష్ప్రచారం చేస్తున్నవారి మీద పరువు నష్టం దావా వేస్తాం అంటూ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను షేక్‌ చేస్తున్న ఈ పరిణామాలు ఎక్కడివరకు వెళతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: