ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బీజేపి ఇంత ఘోరంగా ఒడిపోతుందని వారు భావించి లేరు. అయితే మునుపటి కంటే ఇప్పుడు కాస్త మెరుగైన సీట్లే సాధించినప్పటికీ బీజేపికి ఈ ఓటమి ఓ పాఠంగా మిగిలిపోయింది. అయితే ఈ ఎన్నికల ద్వారా మోదీ తాను అనుకున్నది సాధించాడు. అయితే అది సాధ్యం చేసింది మాత్రం కేజ్రీవాల్..

 

 


మోదీ మొదటి సారి ప్రధానిగా గెలిచినపుడు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదాన్ని ఇచ్చాడు. భారతదేశంలో కాంగ్రెస్ ని లేకుండా చేద్దామ్ అంటూ ప్రజల ముందుకి వచ్చాడు. అయితే మోడీ ఎప్పుడయితే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనడం స్టార్ట్ చేశాడో అప్పటి నుండి కాంగ్రెస్ పరిస్థితి కొద్దిగా మెరుగవడం మొదలైంది. అప్పటి వరకు చాలా రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ మెల్లమెల్లగా పుంజుకోవడం స్టార్త్ అయింది.

 

 


కానీ ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఫలితాలని చూస్తే ఇ విషయమ్ క్లియర్ గా అర్థం అవుతుంది. మొత్తం డెభ్బై సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లతో భారీ మెజార్టి సాధిస్తే, బీజేపి ఎనిమిది సీట్లకే పరిమితమ్ కాగా, కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. అంతే కాదు పోటీ చేసిన 63 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. గత ఎన్నికల్లోనూ ఒక్క సీటు గెలవని కాంగ్రెస్ ఈ సారి మెజారిటీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఢిల్లీలో ఆ పార్టీ భవితవ్యం మీద ఒకరకమైన అనుమానాన్ని రేపింది..

 

 

మోదీ అన్నట్టుగా కాంగ్రెస్ ముక్త్ భారత్ కాకపోయినా.. కాంగ్రెస్ ముక్త్ ఢిల్లీ మాత్రం సాధించగలిగింది. అయితే ఇది బీజేపీ వల్ల కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల కావడమే వింత.. 

మరింత సమాచారం తెలుసుకోండి: