తెలుగు బుల్లితెరపై వస్తున్న ‘జబర్ధస్త్’ కామెడీ షోతో ఎంతో పాపులర్ అయ్యింది యాంకర్ అనసూయ.  ఏడేళ్ల క్రితం మొదలు పెట్టిన జబర్ధస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా పరిచయం అయ్యింది అనసూయ.. తన కవ్వించే మాటలు, చిట్టి పొట్టి డ్రెస్సింగ్ ఈ ప్రోగ్రామ్ కి స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది. జబర్ధస్త్ కార్యక్రమం మొదలైన అతి కొద్ది రోజుల్లోనే మంచి క్రేజ్ సంపాదించిన ఈ అమ్మడికి వరుసగా ఇతర ఛానల్స్ లో ఛాన్స్ రావడంతో జబర్ధస్త్ కి గుడ్ బాయ్ చెప్పింది.  అంతలోనే వెండితెరపై కూడా ఛాన్సులు రావడంతో ఇక జబర్ధస్త్ కి అనసూయ పూర్తిగా గుడ్ బాయ్ చెబుతుందని భావించారు.

 

అదే సమయంలో అనసూయ స్థానంలో రష్మి గౌతమ్ ని తీసుకువచ్చారు.  ఈ అమ్మడు కూడా తన హాట్ లుక్ తో బాగానే అలరించింది.  అయితే జబర్ధస్త్ లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది అనసూయ.  ఇటీవల ఇందులో నుంచి నటుడు నాగబాబుతో సహా పలువురు టీం లీడర్స్ బయటకు వెళ్ళినప్పటికీ ఈ షోకి మాత్రం ఎక్కడ కూడా క్రేజ్ తగ్గలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు అనసూయ పూర్తిగా తప్పుకోనుందని ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతం అనసూయ జబర్దస్త్ షో పాటు జీ తెలుగులో ప్రసారం అయ్యే లోకల్ గ్యాంగ్ లో జడ్జిగా కొనసాగుతుంది.

 

అక్కడ ఆ షోలో కొనసాగుతూనే జబర్దస్త్ లో కొనసాగుతూ వస్తున్నారు. అయితే , తాజాగా జబర్దస్త్ షో నుంచి పూర్తిగా అనసూయని తప్పించాలని ఆ షో నిర్వాహకులు భావిస్తున్నట్టుగా ప్రచారం నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆ స్కిట్లో మాధవిలత చేసిన పెర్ఫార్మెన్స్ ఆధారంగా అనసూయని జబర్దస్త్ షో నుంచి తప్పించాలని ఈటీవీ వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఎంత వరకు నిజమో అబద్దమో అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేస్తే కానీ తెలియదు.  ఇలాంటి పుకార్లు గతంలో కూడా రావడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: