ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి పీఏ పేరుని ఉపయోగించుకొని ఓ కేటుగాడు జనాలకు కుచ్చు టోపీ పెట్టాడు. ప్రభుత్వం ఉద్యోగం పేరుతో ఓ ముగ్గురు నిరుద్యోగుల్ని నిండా ముంచాడు. వివరాలలోకి వెళితే... విజయవాడ సమీపంలోని గొల్లపూడికి చెందిన సత్య శ్రీరామ్ గతంలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేసి మానేశాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. జగదీష్ అనే వ్యక్తి గతేడాది తిరుమలలో గదుల కోసం సత్య శ్రీరామ్‌కు ఫోన్ చేశాడు. శ్రీరామ్ సాయంతో గదులు తీసుకున్నాడు. 

 

ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య సాన్నిత్యం పెరిగి.. ప్రభుత్వ ఉద్యోగం గురించి ప్రస్తావన వచ్చింది.. డబ్బులిస్తే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. తాను వైఎస్ భారతి పీఏనని చెప్పాడు. అతడి మాటలు నిజమే అనుకొని జగదీష్ అఖిల్ యువకుడికి చెప్పాడు. నిజంగానే ఉద్యోగం వస్తుందన్న ఆశతో అఖిల్‌ తన సర్టిఫికేట్లతో పాటూ రూ.60 వేలు ఇచ్చారు. మళ్లీ అధికారులకు లంచం ఇవ్వాలని చెప్పి.. సత్య శ్రీరామ్ డబ్బు వసూలు చేశాడు. మొత్తం రూ.1,12,500 వరకు వసూలు చేశాడు. 

 

కొద్ది రోజుల తర్వాత సదరు వ్యక్తి వై.ఎస్‌.భారతి పీఏ కాదని అఖిల్‌కు తెలిసింది. దీంతో బాధితులు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. ఇలా మొత్తం ముగ్గుర్ని ఉద్యోగాల పేరిట మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలాంటి సంఘటనలు మనకు కొత్తేమి కాదు. సమాజంలో కొంచెం పేరు.. ప్రఖ్యాతులు వున్న వారిని టార్గెట్టుగా చేసుకొని, పలువురు కేటుగాళ్లు నిరుద్యోగులే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. ఇటీవల ఇలాంటి వుదంతులు చాలానే చూస్తున్నాం.

 

ఇటీవల కొంతమంది కేటుగాళ్ళు జనాలకు రుణాలు ఇస్తామని  కుచ్చుటోపి పెట్టి మోసం చేసిన సంఘటనలు మనం పలు విన్నాం. రుణాల కోసం చెప్పులు అరిగేలా తిరిగినా దొరకవు. అలాంటిది వాళ్ళే వచ్చి రుణాలు ఇస్తామంటే జనాలు తీసుకోకుండా వుంటారా చెప్పండి. ముందు నమ్మకం కుదిరించుకుని తర్వాత వాళ్ళ పని కానించుకుంటారు మోసగాళ్ళు. అలానే చేశాడు ఘరానా మోసాగాడు, దాదాపు 100 మందికి పైగా టోకరావేసి రూ. 3 కోట్లు స్వాహా చేశాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: