చంద్రబాబునాయుడు మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంటిపై దాడులకు సంబంధించి జనసేన అధినేత  పవన్ కల్యాణ్ కు దిమ్మ తిరిగిపోయిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే చంద్రబాబుకు పవన్ అజ్ఞాత మిత్రుడన్న విషయం అందరికీ తెలిసిందే. పవన్ దృష్టిలో చంద్రబాబు మిస్టర్ క్లీన్. నిప్పులాంటి రాజకీయ నేత. అందుకనే చంద్రబాబు ఎంత అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నా పవన్ కు అవేవీ కనబడవు, వినబడవు.

 

అదే సమయంలో సంబంధం లేని అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డికి ముడేసి నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేయటమంటే పవన్ కు మహా సరదా. అలాంటి పవన్ ఇపుడు చంద్రబాబుకు సంబంధించి నోరిప్పలేకపోతున్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి పిఎస్ పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ ఇంటిపై ఐటి అధికారులు దాడి చేసిన విషయం తెలిసిందే. సోదాలు కూడా ఏదో ఓ పూటో లేకపోతే ఓ రోజో కాదు. ఏకంగా ఐదు రోజులు సోదాలు జరగటంతో అందరూ ఆశ్చర్యపోయారు.

 

సరే సోదాలు జరగటమంటే మామూలే అనుకోవచ్చు. కానీ గురువారం రాత్రి ఐటి అధికారులు అధికారికంగా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో  మాజీ పిఎస్ శ్రీనివాస్ దగ్గర సుమారు రూ. 2 వేల కోట్ల బ్లాక్ మనీ లావాదేవీలు జరిగినట్లు చెప్పటం సంచలనంగా మారింది. గురువారం రాత్రి ప్రెస్ నోట్ రిలీజైనా శుక్రవారం కూడా పవన్ ఎక్కడా స్పందించలేదు. అసలు ఇటువంటి పరిస్ధితి వస్తుందని కూడా పవన్ ఊహించుండరు. అందుకనే ప్రెస్ రిలీజ్ చూడగానే పవన్ కు దిమ్మ తిరిగిపోయుండాలి.

 

కానీ విచిత్రమేమిటంటే పవన్ ఇపుడు చంద్రబాబుకు మిత్రుడు కాదు. పైగా బద్ధ శత్రువైన బిజెపికి మిత్రపక్షం. మరి అలాంటపుడు బిజెపి నేతలు చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నట్లుగానే పవన్ కూడా ఆరోపణలు, విమర్శలు చేయాలి. ఒకవైపు బిజెపి నేతలు చంద్రబాబును చీల్చి చెండాడేస్తున్నా పవన్ మాత్రం తనకేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. మరి ఎప్పుడు స్పందిస్తారో చూద్దాం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: