తెలుగు ఇండస్ట్రీలోకి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నపుడు రాక్షసుడు చిత్రంతో మెరుపులా మెరిశాడు ఆయన సోదరుడు నాగబాబు.  ఈ చిత్రంలో ఆయన చిరంజీవితో ఢీ కొనడం అప్పట్లో ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు.  కొన్ని చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. అంతే కాదు నాగబాబు కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ చిత్రంతో భారీగా నష్టపోయాడు నాగబాబు.  అదే సమయంలో జబర్ధస్త్ కార్యక్రమం మొదలైంది.  ఈ కార్యక్రమానికి జడ్జీగా వ్యవహరిస్తూ మంచి సంపాదనలో పడ్డారు.  ఓ వైపు సినిమాలు.. జబర్ధస్త్ ఇలా ఏడేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగారు నాగబాబు. గత ఏడాది ఏపిలో ఎన్నికల జరిగిన తర్వాత ‘జనసేన’ పార్టీ తరుపు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

 

అంతలోనే జబర్ధస్త్ కి కూడా గుడ్ బాయ్ చెప్పి జీ తెలుగు ‘అదిరింది’ కామెడీ షోకి జడ్జీగా ఎంట్రీ ఇచ్చారు. అయితే
వినోదాల విందులో అగ్రతాబులం దక్కించుకున్న కార్యక్రమం జబర్ధస్త్. స్టేజ్ ఆర్టిస్టులుగానో చిన్న పాత్రల కోసం సినీ స్టూడియోల చూట్టు తిరిగే కొంత మంది కళాకారులకు జబర్ధస్త్ తమ టాలెంట్ నిరుపించుకునే అవకాశం కల్పించింది.  దాంతో ఈ ప్రోగ్రామ్ తో ఇప్పుడు ఒక్కొక్కరు వెండి తెరపై కూడా నటిస్తూ తమ సత్తా చాటుతున్నారు. 

 

మరోవైపు నాగబాబు జడ్జీగా వ్యవహరిస్తు ‘అదిరింది’కి అదరలేకపోవడానికి కారణాల్లో వీక్షకులు, విమర్శకులు చెబుతున్న మూడు మాటాలు పాత సీసాలో కొత్త సారాలా ఉండడం, తెచ్చి పెట్టుకున్న నవ్వును కార్యక్రమానికి అతికినట్లు చూపించలేని యాంకర్ వైఫల్యం, అన్నిటికిమించి ప్రసారాల క్వాల్టీ కూడా ఏమాత్రం అందరికీ ఆమోదయోగ్యం కాకుండా ఉందని చెప్పుకోటున్నారు.

 

వీటి మధ్యలో నాగబాబు పరిస్థితి గందరగోళంగా తయారైనట్లు తెలుస్తోంది. మంచి పాపులారిటీ సంపాదించిన జబర్ధస్త్ నుంచి ఆయన వెళ్లి రావడంపై ఆలోచనలో పడ్డారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి వార్తలు కామన్ అని కొట్టి పడేస్తున్నారు మెగా ఫ్యాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: