పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కనిపించకుండా పోయాడట... దాదాపు 20 రోజుల నుంచి ఆయన కనిపించడం లేదట.. ఈ మేరకు ఆయన భార్య కింజాల్ పటేల్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.  ఆ మద్య దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు పలికిన విషయం తెలిసిందే.  జనవరి-24నుంచి హార్థిక్ పటేల్ కనిపించడం లేదంటూ ఆయన భార్య కింజాల్ సోమవారం పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇచ్చింది. జనవరి-18,2020న హార్థిక్ ను పోలీసులు అరెస్ట్ చేయగా జైలు నుంచి జనవరి-24న హార్థిక్ విడుదలయ్యాడు.  గుజరాత్ పాలకులు తన భర్తను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. 

 

టిదార్ ఉద్యమంలో పాల్గొన్న మరో ఇద్దరు వ్యక్తులు బీజేపీలో చేరడంతో వారిపై కేసులు ఎత్తేశారని... తన భర్తను మాత్రమే  లక్ష్యంగా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ప్రజల కోసం పోరాడుతున్నారని.. అది కొంత మంది నాయకులకు గిట్టడం లేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.  గుజరాత్ లో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, తన భర్తను జైలుకు పంపేందుకు యత్నిస్తున్నారని కింజాల్ పటేల్ చెప్పారు.  గతంలో పాటిదార్ ఉద్యమంలో పనిచేసిన మరో ఇద్దరు.. బీజేపీలో చేరడంతో వారిపై కేసులు ఎత్తివేశారని.. కానీ, ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న హార్దిక్ పటేల్‌ను వదలడంలేదన్నారు.

 

ఇక, రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హార్థిక్ పటేల్ ను జైలుకు పంపించేందుకు గుజరాత్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు కింజాల్ పటేల్.  తన భర్త ప్రాణానికి ముప్పు ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడుపడితే అప్పుడు పోలీసులు మా ఇంటికి వస్తున్నారు అంటూ కింజల్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కింజల్ ఆరోపణలను గుజరాత్ డీజీపీ శివానంద్ జా తోసిపుచ్చారు.   మరోవైపు హార్థిక్ పై గుజరాత్ పోలీసులు తప్పుడు కేసులు బనాయించి అతడిని వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: