చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా గురించిన చర్చలే సాగుతున్నాయి. ఓ వైపు కరోనా మృత్యు ఘోష తో చైనా అతలాకుతలం అవుతుంటే.. కొంత మంది సెటైర్లు కూడా వేస్తున్న విషయం తెలిసిందే.   తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆ పార్టీపై సెటైర్లు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ అంటే తెలియని వారు ఉండరు.  తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో ఈయన జోక్యం ఎంతో ఉందని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి.  ఎప్పుడూ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ జైరామ్ రమేష్ వార్తల్లో నిలుస్తున్నారు. 

 

తాజాగా మరోసారి ల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కరోనా వైరస్ లా తాకాయని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  షహీన్ బాగ్, పౌరసత్వ చట్టం తదితర అంశాలను బీజేపీ ప్రచార అస్త్రంగా చేసుకుందని, తద్వారా ఓట్లను చీల్చిందే తప్ప, ఆ పార్టీ గెలవలేకపోయిందని, అధిక నష్టం జరిగింది మాత్రం కాంగ్రెస్ పార్టీకేనని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎన్ని సార్లు ఓటమి పాలు అవుతున్నా.. ఎక్కడ కూడా ప్రక్షాళన చేసుకోకుండా.. మొండి వైఖరితో ముందుకు సాగుతున్నారని ఆయన అభిప్రాయ పడ్డారు.   మైనారిటీ మతవాదంపై కాంగ్రెస్ సామరస్య ధోరణితో ఉంటోందన్న ప్రచారంతో నష్టం జరిగిందని అన్నారు.

 

ఒక్కసారిగా కరోనా సోకితే ఎంత నష్టం జరుగుతుందో, అంత నష్టం కాంగ్రెస్ కు జరిగిందని తెలిపారు. మైనారిటీ ప్రజల మనోభావాల పట్ల కొందరు సీనియర్లు సున్నితంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైర్ కాంగ్రెస్ సోకినట్లే అనిపిస్తుందని.... వెంటనే చికిత్స అవసరం ఆయన సెటైర్లు వేశారు.  జాతీయ పార్టీగా కాంగ్రెస్ కి ఎంతో ఘన చరిత్ర ఉంది.. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయకుడిది అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: