కరోనా వైరస్... ఈ పేరు వింటేనే గజగజ వణికిపోతున్నారు ప్రజలు. చైనాలోని ఊహన్  నగరంలో గుర్తించబడిన కరోనా వైరస్... ప్రస్తుతం చైనాలో మరణ మృదంగం మోగిస్తోంది. సునామి  వచ్చి అందినకాడికి మట్టికరిపించినట్టే..  కరోనా  వైరస్ సోకిన అందరిని కాటికి పంపిస్తుంది. ప్రస్తుతం చైనా దేశాన్ని ప్రాణభయంతో వణికిస్తున్నది కరోనా  వైరస్ . అయితే రోజురోజుకు ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కాగా  ఈ కరోనా  వైరస్ లెక్క చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ రోజురోజుకు ఈ ప్రాణాంతకమైన వైరస్ వ్యాప్తి పెరుగుతుంది కానీ తగ్గినట్లు దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. తాజాగా చైనా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 15 వందల మంది ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి ప్రాణాలు వదిలారు. వైరస్ సోకిన వారి సంఖ్య 63 వేల 841 మందికి చేరుకుంది.

 


 శుక్రవారం ఒకేరోజున 5090 కొత్త కరోనా  కేసులు నమోదు అవ్వడం  ప్రస్తుతం అందరి మనసుల్లో  కలవరం సృష్టిస్తోంది. ఒకే రోజులో 121 మంది ఈ వ్యాధితో పోరాడుతూ మృతి చెందారు. వీరిలో 116 మంది వ్యాధి కేంద్రమైన హుబి  ప్రావిన్స్ కు చెందినవారే. అయితే చైనా మొత్తం శర వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ ప్రాణాంతకమైన వైరస్. హుబి  ప్రావిన్స్ లో  మాత్రం.. మరింత ఎక్కువగా ఉంది.అక్కడి  ప్రజలందరికీ కాటికి దారులు పరుస్తుంది కరోనా . మరోవైపు అటు జపాన్లో కూడా కేసు నమోదైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాణాంతకమైన వైరస్ కలకలం రేపుతోంది. కాగా కరోనా  తో బాధపడుతున్న కేరళ విద్యార్థిని ఇటీవల డిశ్చార్జి చేశారు.  రక్త పరీక్షల్లో వరుసగా వైరస్ లేదని తేలడంతో అతడిని డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. 

 


 కాగా కేరళలో ఈ ప్రాణాంతకమైన వైరస్ సోకిన మరో ఇద్దరిని ఇంకా ఐసోలేటెడ్ వార్డులో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారు. రక్త పరీక్షల రిపోర్టులు బట్టి తుది నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇకపోతే అటు భారతదేశంలో కూడా కరోనా  అనుమానితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కాగా  భారతదేశంలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపడుతుంది. అంతే కాకుండా ప్రాణాంతకమైన వైరస్ కు సరైన విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలందరూ నిమగ్నమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: