మాజీ పిఎస్ ఇంటిపై ఐటి దాడుల్లో బయపడిన సంచలన విషయాలకు సంబంధించి చంద్రబాబునాయుడు అరెస్టే ఇక మిగిలిందా ? అవుననే అనిపిస్తోంది. చంద్రబాబు దగ్గర ఐదేళ్ళు పిఎస్ గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ ఇంటిపై ఐటి అధికారులు దాడులు చేయటం, సోదాల్లో డైరీలు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు తదితరాలను స్వాధీనం చేసుకోవటం అందరికీ తెలిసిందే. దాని ఫాలో అప్ గా  ఐటి శాఖ అధికారికంగా శ్రీనివాస్ దగ్గర రూ. 2 వేల కోట్ల బ్లాక్ మనీ లావాదేవీలు బయటపడినట్లు చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

 

అయితే ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం శ్రీనివాస్ అప్రూవర్ గా మారిపోయారనిట. అప్రూవర్ గా మారిన శ్రీనివాస్ చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాలు మొత్తం పూసగుచ్చినట్లు చెప్పేశారని సమాచారం. దాని ఆధారంగానే  చంద్రబాబు అరెస్టు చేయాలని  ఉన్నతస్ధాయి వర్గాలు డిసైడ్ అయ్యారట. శ్రీనివాస్ అప్రూవర్ గా మారిన నేపధ్యంలో ముందు చంద్రబాబుపై కేసు నమోదు చేసి ఆ తర్వాత అరెస్టు చేయబోతున్నట్లు సమాచారం.

 

ఢిల్లీలో ఐటి, సిబిఐ, ఈడి ఉన్నతాధికారులు నివేదికల్లోని అంశాలను కేంద్ర హోంశాఖ అమిత్ షా తో కూడా చర్చించినట్లు సమాచారం. దాంతో ఆ విషయం ప్రధానమంత్రి నరేంద్రమోడికి కూడా చేరిందట. అంతా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అరెస్టు తర్వాత తలెత్తే వ్యవహారాలపై అన్నీ కోణాల్లో చర్చించుకున్న తర్వాతే జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించారట.

 

చంద్రబాబును అరెస్టు చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య ఏమన్నా తలెత్తుతుదా ? అదే జరిగితే ఎలా మ్యానేజ్ చేస్తారు ? అన్న విషయాలను కూడా జగన్ తో మోడి ప్రస్తావించినట్లు సమాచారం. లా అండ్ ఆర్డర్ సమస్యలేవీ తలెత్తదని, ఒకవేళ ఏదైనా సమస్యలు వచ్చినా తాను కంట్రోల్ చేయగలనని జగన్ హామీ ఇచ్చారట. అయితే అదే విషయాన్ని అమిత్ షా తో కూడా మాట్లాడాలని మోడి చెప్పిన తర్వాతే శుక్రవారం జగన్ అమిత్ షా తో కలుస్తున్నారు. అంటే శ్రీనివాస్ కూతురు వివాహం కోసమే అరెస్టు వాయిదా పడింది. వివాహ కార్యక్రమం అయిపోగానే పెండ్యాలను అరెస్టు తర్వాత చంద్రబాబు అరెస్టు జరగటం ఖాయమని అంటున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: