ఢిల్లీలో ఎంతో ఉత్కంఠంగా ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే.  అయితే మొదటి నుంచి అన్నీ సర్వేలు ఆమ్ ఆద్మీ పార్టీకే ఎక్కువ మెజార్టీ వస్తుందని ఢంకా పథంగా చెప్పాయి. అనుకున్నట్టే మొన్న వచ్చిన రిజల్ట్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.  జాతీయ పార్టీపై ప్రాంతీయ పార్టీ హవా కొనసాగింది.  గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సైతం ఇతే తంతు కొనసాగిన విషయం తెలిసిందే.  ఎప్పటి నుంచో పాతుకు పోయిన జాతీయ పార్టీలపై ప్రాంతీయ పార్టీలు అఖండ విజయం సాధించాయి.  తెలంగాణలో టీఆర్ఎస్, ఏపిలో వైసీపీ పార్టీలు అత్యధిక మెజార్టీతో గెలుపొందాయి.  ఢిల్లీలో బంపర్ మెజారిటీతో రికార్డు సృష్టించిన కేజ్రీవాల్ తన ప్రమాణస్వీకారాన్ని కూడా అదే స్థాయిలో జరపబోతున్నారు.

 

ఢిల్లీలోని ప్రఖ్యాత రామ్ లీలా మైదాన్ వేదికగా అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణం చేయడం ఇది మూడోసారి. అయితే ఈ సారి ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి రాజకీయ హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా జరుపుకోవాలని అనుకున్నారు. విఐపిలకు మాత్రం ఇందుకు ఇన్విటేషన్లు లేవు. అంతేకాదు...తనని గెలిపించిన ప్రజలకే ప్రథమ ఆహ్వానం పలికారు సామాన్యుల నేత. సాధారణంగా ఇతర రాష్ట్రాల సీఎంలు..మాజీ సీఎంలని పిలిచి హంగామా చేయడం జనరల్‌గా చూస్తుంటాం.

 

కానీ అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఆ సంప్రదాయానికి చెక్ పెట్టారు. కాకపోతే ఈ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా ప్రధాని మోదీని కేజ్రీవాల్ కోరారు.  ఇతర పార్టీ నేతలను, ప్రముఖులను ఆహ్వానించని కేజ్రీవాల్..   మోదీకి కేజ్రీవాల్ ఆహ్వానం పలకడం విశేషం.  ఇప్పుడు ఇదే ఢిల్లీలోనే కాదు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నడుస్తుంది.  అయితే  కేజ్రీవాల్ ఆహ్వానం మేరకు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి మోదీ వస్తారా? లేదా? అనే విషయం అందరికీ ఆసక్తిగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: