ఏదో ఒకటి చేసి అర్జెంటుగా తెలంగాణ అధికార పార్టీ అనిపించుకోవాలని తహతహలాడుతున్నారు బీజేపీ అగ్ర నాయకులూ. ఒక వైపు అధికార పార్టీ, ఆ పార్టీ నాయకులు చురుగ్గా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. కానీ తెలంగాణ బీజేపీకి ఆ స్థాయిలో చురుగ్గా పనిచేసే నాయకులు కరువయ్యారు. చెప్పుకోవడానికి పేరుమోసిన నాయకులు చాలామందే ఉన్నా వారి ప్రభావం మాత్రం అంతంత మాత్రంగానే ఉండడంతో చాలా కాలంగా బిజెపి తెలంగాణాలో పుంజుకోలేకపోతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ను ఢీ కొట్టి అధికార పీఠం దక్కించుకునేందుకు భారీగానే ప్రయత్నాలు చేసినా ఫలితం ఇవ్వలేదు. 


తెలంగాణ  మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి వచ్చింది. దీంతో ఒక్కసారిగా కేంద్ర బిజెపి పెద్దలు అసహనం, ఆగ్రహం, ఆవేశం అన్ని కట్టగట్టుకుని వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడుగా లక్ష్మణ్ ఉన్నారు. ఆ  స్థానంలో మరొకరు నియమించి పార్టీని పరుగులు పెట్టిద్దామని చూస్తున్నా ఆ స్థాయి నాయకులు మాత్రం బిజెపికి కనిపించడం లేదు. ఇప్పటికే ఒక్కో రాష్ట్రంలో వెనకపడుతూ వస్తున్న బిజెపి ఆ విధంగానే తెలంగాణలోనూ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తూ వెళితే ముందు ముందు ప్రస్తుతం ఉన్న పరిస్థితి కూడా బీజేపీకి ఉండదనే ఆలోచనలో ఉంది. 


తెలంగాణ బిజెపి అధ్యక్ష రేసులో ఇప్పటికే సీనియర్ నాయకులు మురళీధర్రావు, ఎంపీలు బండి సంజయ్, అరవింద్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ, ఇంద్రసేనా రెడ్డి తదితరులు ఉన్నారు. కానీ ఈ లిస్టులో ఉన్న నాయకులపై కేంద్ర బిజెపి పెద్దలకు అంతగా నమ్మకం లేదు. వీరు కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తగినంత మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకులైతే టిఆర్ఎస్ ను బలంగా ఢీ కొట్టి పార్టీని ముందుకు తీసుకు వెళ్ళగలరు అనే ఆలోచనలో కేంద్ర బీజీపీ పెద్దలు ఉన్నారు. దీనికోసమే ప్రస్తుతం ఉన్న తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మార్చకుండా అలా కొనసాగిస్తున్నారు. 


తమ పార్టీలో బలమైన నా మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు లేకపోయినా ఇతర పార్టీల్లో అటువంటి వారు ఉంటే వారిని గుర్తించి మెల్లిగా బీజేపీలో చేర్చుకుని పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే భవిష్యత్తులో ఆశాజనకంగా ఫలితాలు ఉంటాయని, అప్పుడు అధికారం లోకి రావచ్చు అనే ఆలోచనలో కేంద్ర బిజెపి పెద్దలు ఉన్నట్టుగా సమాచారం. ఆ స్థాయి నాయకుడు దొరికేవరకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా లక్ష్మణ్ నే కొనసాగించేలా బీజేపీ అగ్ర నాయకులు ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: