బీహార్‌ మాజీ ముఖ్యమత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఆయన వియ్యంకుడు చంద్రికా రాయ్‌ షాక్‌ ఇచ్చారే. చంద్రికా రాయ్‌ ప్రస్తుతం ఆర్జేడీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన జేడీయూలో చేరే అవకావం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏ పార్టీలో చేరబోయేది వెల్లడించకపోయినా.. ఆర్జేడీ మీద మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రికా రాయ్‌. ఆత్మగౌరవంతో జీవించే వాళ్లు ఆర్జేడీ పార్టీలో కొనసాగలేరని ఆయన ఆరోపించారు.

 

చంద్రికా రాయ్‌ కుమార్తే ఐశ్వర్య రాయ్‌ను లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులకే వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావటంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం వీరి విడాకుల వ్యవహరానికి సంబంధించిన వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన కుమార్తెను లాలూ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవీ వేధింపులకు గురిచేశారంటూ చంద్రికా రాయ్‌ పోలీసులుకు ఫిర్యాదు చేశారు.


బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో చంద్రికా రాయ్‌ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అనధికారికంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ నిర్వహించే కార్యక్రమాలను తాను బహిష్కరిస్తున్నట్టుగా అధికారికంగానే ప్రకటించాడు చంద్రికా రాయ్‌. ప్రస్తుతానికి జేడీయూలో చేరుతన్నట్టుగా వెల్లడించకపోయినా ఆర్జేడీపై తీవ్ర విమర్శలు చేయటం, అదే సమయంలో నితీష్ కుమార్‌ దార్మనికత గల ముఖ్యమంత్రి అని, ఆయన హయాంలో బీహార్‌ సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పటంతో ఆయన జేడీయూ వైపు చూస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రహస్యంగా ఆయన నితీష్‌తో సమావేశం అయ్యారన్న ప్రచారం కూడా జరుగుతోంది.


చంద్రికా రాయ్‌ గుడ్‌ బై చెప్పటం ఆర్జేడీ పార్టీకి తీవ్రం నష్టం చేస్తుందంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా లాలూ కుటుంబానిక ప్రధాన బలంగా ఉన్న సామాజిక వర్గ ఓట్లు భారీగా చీలిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం లాలూ దాణా కుంబకోణం కేసులో శిక్ష అనుభవిస్తుండగా ఆయన చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్‌ పార్టీ వ్యవహరాలు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: