ఈ మద్య సోషల్ మీడియా పుణ్యమా అని చిత్ర విచిత్ర విషయాలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. మంచీ, చెడు ఎలాంటి వార్తలైనా ఇట్టే వైరల్ అవుతున్నాయి. సాధారణంగా అప్పుడప్పుడు మనిషికి అనుకోని ప్రమాదాలు ఊహకందని విధంగా జరుగుతూ ఉంటాయి.  ద్విచక్ర వాహనదారులు తమ భద్రత కోసం హెల్మెట్ వాడుతుంటారు.  కానీ ఆ హెల్మెట్ ప్రమాదం అని తెలిస్తే.. ఆ మనిషి పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. తాజాగా కేరళలో ఓ ఉపాధ్యాయుడికి భయానక అనుభవం ఎదురైంది. హెల్మెట్లో ఓ పాము పిల్ల ఉందని తెలియకుండానే ఆయన 11 కిలోమీటర్లు ప్రయాణం చేసి, ఆ తర్వాత హెల్మెట్లో పాము పిల్లను చూసి హడలిపోయిన ఘటన మీడియా దృష్టిని ఆకర్షించింది.  కేరళకు చెందిన "రంజిత్" కందనాడ్ సెయింట్ మేరీ హైస్కూల్‌ లో టీచర్ గా పని చేస్తున్నారు.

 

రంజిత్ ఫిబ్రవరి 5 న ఉదయం 8:30 గంటల సమయంలో ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరాడు. ఆయన తరగతి ముగించుకుని అక్కడ నుంచి త్రిపునితురా ఆర్‌ఎల్‌వి పాఠశాలకు బయలుదేరాడు. కందనాడ్ పాఠశాలనుంచి త్రిపునితురా ఆర్‌ఎల్‌వి పాఠశాలకు 6 కిలోమీటర్లు. ఆర్‌ఎల్‌వి పాఠశాల చేరుకున్న తరువాత రంజిత్ తన హెల్మెట్ లో పాము ఉండటం గమనించారు. అంతే ఒక్కసారే షాక్ కి గురి అయ్యాడు.. ఇంతసేపు తన హెల్మెట్ లో పామును ఉంచుకొని దాన్ని తన తలకు పెట్టుకొని ఇంత సేపు ప్రయాణం చేశానా.. అంటూ ఆశ్చర్యపోాడు.

 

అయితే ఆ పాము సామాన్యమైదేమీ కాదట.  ఆ పాము అత్యంత విషపూరితమైన "కామం క్రైట్", అది అప్పటికే చనిపోయి ఉంది. తరువాత రంజిత్ పామును గుర్తించిన వెంటనే చనిపోయిన పాముని తగులబెట్టాడు. కాగా, తన ఇంటి వద్ద ఓ చెరువు ఉందని.. చుట్టు పక్కల చెట్లూ చేమలు ఉన్నాయని.. ఆ పాము  పిల్ల అక్కడ నుంచి వచ్చి తన హెల్మెట్ లో దూరి ఉంటుందని ఆయన అంటున్నారు. ఏది ఏమైన తాను పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డందుకు సంతోషంగా ఉందన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: