మూడుముళ్ళ‌తో ఒక్క‌టైన ఇద్ద‌రి మ‌నుషుల జీవితంలోకి మూడో వ్య‌క్తి రూపాన్న ఓ బుల్లిపాపాయికాని బాబు గాని అడుగు పెడితే క‌లిగే సంతోష‌మే వేర‌ని చెప్పాలి. ఏడ‌డుగులు న‌డిచి నాలుగు నెల‌లు గ‌డ‌వ‌క‌ముందే ఏమ‌యినా విశేష‌మా అంటూ పెద్ద‌లు ఆరాతీస్తుంటారు. ఇక ఐదో నెల దాటిందంటే చాలు డాక్ట‌ర్ల‌ను ఒక‌సారి క‌ల‌వ‌క‌పోయారా అంటూ ఉచిత స‌ల‌హాలు ఇస్తుంటారు. భార్యా, భ‌ర్త‌లేకాదు వారి కుటుంబాల్లో అంద‌రూ  కూడా ఇలా కోరుకుంటారు. బుడి బుడి అడుగుల‌తో సంద‌డి చేసే చిన్నారి కోసం ప్ర‌తి ఒక్క‌రు  ఎదురు చూస్తారు. తాత‌ముత్తాత‌ల నాటికాలం అయితే స్త్రీ,  పురుషుల్లో సంతానోత్ప‌త్తి శాతం 80 నుంచి 90 శాతంగా ఉండేది. కాని ఇప్పుడ‌ని 40 నుంచి 50 శాతం వ‌ర‌కు ప‌డిపోయింది. మారిపోయిన ఆహార‌పు అల‌వాట్లు ఉద్యోగ‌జీవితం, టెక్నాలజీ పెర‌గ‌డం వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అన్నీ భార్యా భ‌ర్త‌ల ఆశ‌ల‌ను ఆవిరి చేయ‌డంలో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తున్నాయి. కార‌ణం ఏదైతేనేమి పిల్ల‌లు పుట్ట‌ని దంప‌తులు వైద్యులో సంతానోత్ప‌త్తి కేంద్రాల‌కు వెళుతున్నారు. భార్యా భ‌ర్త‌ల‌కు అస‌లు సంతానం ఎందుకు క‌ల‌గ‌దు.  శృంగార జీవితం బాగానే ఉన్నా అనారోగ్యాలు అస‌లే లేకున్నా పిల్ల‌లు ఎందుకు క‌ల‌గ‌డం లేదు అనే ప్ర‌శ్న ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సులోను మెదులుతుంది. సంతానోత్ప‌త్తికి అవ‌రోధంగా ఉండే కొన్ని ప్ర‌ధాన అంశాల‌ను వైధ్యులు ఈ విధంగా తెలుపుతున్నారు. 

 

ఉద‌యం సాయంత్రం వ్యాయామం చేస్తూ ఒళ్ళు త‌గ్గించుకుంటూ ఆరోగ్యం పెంచుకుంటున్నారు ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు. ఎంత ఎక్కువ సేపు వ్యాయామం చేస్తే అంత మంచిద‌ని భావించేవారు కూడా లేక‌పోలేదు. కాని ఈ వ్యాయామం కూడా పిల్ల‌లు పుట్టే విష‌యం కీల‌క పాత్ర పోషిస్తుంది. సాధార‌ణ బ‌రువు ఉన్న స్త్రీ వారిని ఐదు గంట‌లు మించి వ్యాయామం చేస్తే సంతానం క‌ల‌గ‌డం ఆల‌స్య‌మవుతుంద‌ట‌. అలాగే శ‌రీరంలో కొవ్వుశాతం అధికంగా ఉన్నాస‌రే పిల్ల‌లు పుట్టే ఛాన్స్ చాలా త‌క్కువ‌ట‌. అదే పురుషుల విష‌యానికి వ‌చ్చేస‌రికి వ్యాయామం చేసే స‌మ‌యం ఎక్కువ‌గా ఉంటేనే మంచిద‌ట‌. వారానికి క‌నీసం ప‌దిహేను గంట‌లు జిమ్‌లో క‌ష్ట‌ప‌డేవారిలో వీర్య క‌ణాల అభివృద్ధి 73శాతం అధికంగా ఉంటుంది. 

 

మ‌గ‌వారు చాలా మంది త‌మ ఉద్యోగ వ్యాపార కార్య‌క‌లాపాల త‌ర్వాత ఇంటికి వ‌చ్చి టివి చూస్తూ ప‌డుకోవ‌డం అస్స‌లు మంచిది కాదు అంటున్నారు వైద్యులు. అలాంటివారు సంతానం విష‌యంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవ‌కాశం ఎక్కువ‌ని వైద్యులు తెలుపుతున్నారు. వారానికి 20 గంట‌ల‌కు మించి టీవీల ముందు కూర్చుంటే వీర్య‌క‌ణాల వృద్ధి త‌గ్గిపోతుంద‌ట‌. ఒక‌వేళ బోర్ అనిపిస్తే భార్య‌కు ఇంటిప‌నుల్లో సాయం చేయ‌డ‌మో లేదా స‌ర‌దాగా బ‌య‌ట‌కు వెళితే ఈ టీవీ చూడ‌టం అనేది నివారించ‌వ‌చ్చు. అలాగే మ‌గ‌వారు అధికంగా మాంసం తిన్నా కూడా వీర్య‌క‌ణాల వేగం మంద‌గిస్తుంద‌ట‌. దానిబ‌దులు గుడ్లు రోస్ట‌డ్ చికెన్ తిటే వీర్య‌క‌ణాల ఉత్ప‌త్తి ఎక్కువ‌గా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: