రెండు రోజుల క్రితమే ప్రధానమంత్రి మోడీ తో కలిసి అనేక కీలక విషయాలపై చర్చించి హుషారుగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసేందుకు మరికొద్ది సేపట్లో ఢిల్లీకి బయలుదేరబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రాత్రికి ఢిల్లీలో మకాం వేసి రేపు ఉదయం బీజేపీ కీలక నాయకులందరినీ కలిసే విధంగా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తం రెండు రోజుల పాటు జగన్ ఢిల్లీలోనే మకాం వేసి అనేక విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఏపీలో బీజేపీ సహకారం అన్ని విషయాల్లోనూ ఉండే విధంగా జగన్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 


రేపు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలవబోతున్నారు. రెండు రోజుల క్రితమే ప్రధాని మోదీని కలిసి న జగన్ ఇప్పుడు కేంద్ర హోం మంత్రిని కలిసి ఈ అంశాలపై చర్చించబోతున్నారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్రంలో వైసీపీ కి సముచిత స్థానం ఇవ్వడమే కాకుండా, రెండు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేందుకు మోదీ జగన్ వద్ద ప్రతిపాదించడంతో జగన్ వెంటనే ఒకే చెప్పేసారు. ప్రస్తుతం జగన్ పర్యటనలో వైసిపి ఎన్డీయేలో చేరే విషయమై క్లారిటీ గా చర్చించేందుకు జగన్ వెళ్తున్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పాటు కేంద్రం మంత్రి మండలిలో చేరబోయే ఇద్దరి మంత్రులు ఎవరెవరు అనే విషయాలపైన కూడా జగన్ క్లారిటీగా మాట్లాడేందుకే ఈ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. 


దీంతో పాటుగా ఏపీకి సంబంధించిన అనేక కీలక విషయాలపై మోదీ జగన్ చర్చించుకున్న విషయాలపైనా అమిత్ షా కు జగన్ వివరించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే కేంద్రమంత్రిగా విజయ సాయి రెడ్డి పేరు దాదాపు ఫైనల్ అయ్యిందని,  మరో మంత్రి పదవికి ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవికి కూడా మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. ఇక జగన్ మాత్రం నందిగం సురేష్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, కాకినాడ కాపు సామాజిక వర్గానికి చెందిన వంగ గీత తదితరుల పేర్లు మంత్రి పదవి లిస్టులో జగన్ చేర్చినట్టు తెలుస్తోంది. 


వీరిలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అయితే అమిత్ షా జగన్ భేటీపై టిడిపి శిబిరంలో ఆందోళన నెలకొంది. మోదీని కలిసిన తర్వాత రోజు ఏపీలో టిడిపి నాయకులే టార్గెట్ గా ఐటీ దాడులు మరింత తీవ్రతరం అవ్వడం, ఆ కేసుల్లో టిడిపి అధినేత చంద్రబాబు టార్గెట్ గా ఆధారాలు లభించడంతో టిడిపి బెంబేలెత్తిపోతోందది. ఇప్పుడు అమిత్ షాతో భేటీ అనంతరం తమపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా వారు ఆందోళన చెందుతున్నారు.  ఏది ఏమైనా కేంద్ర బిజెపి పెద్దలను కలిసిన తర్వాత జగన్ ఉత్సాహం గా కనిపిస్తున్నారు. గతంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు బీజేపీ పెద్దలకు చెప్పే తీసుకున్నామన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యల్లో నిజం ఉంది అనేది ఇప్పుడే అందరికి అర్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: