ఆరేళ్ళ నుంచి బిజెపి ఎం చెప్తే అది ప్రజలు నమ్మారు. దేశ భక్తి అంటే దేశ భక్తి, దేశ ద్రోహులు అంటే దేశ ద్రోహులు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయారో లేదో తెలియదు గాని ప్రజలలోనే చచ్చిపోయిన ఇందిరా, రాజీవ్ గాంధి కుటుంబం ఎప్పుడు కూడా మేము పలానా మతం అని గాని మేము దేశం కోసం ప్రాణాలు అర్పించాం అని గాని ఎప్పుడూ చెప్పుకోలేదు. దేశానికి పని చేసిన ప్రధానుల కులం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. నెహ్రూ నుంచి మన్మోహన్ వరకూ కూడా. కాని మోడీ వచ్చిన తర్వాత మాత్రం జనాలకు కులం గురించి పరిచయం చేసారు. 

 

ఏది మాట్లాడినా సరే తాను ప్రధాని అవ్వడం కొన్ని అగ్ర కులాలకు నచ్చడం లేదనే విషయాన్ని పదే పదే చెప్పడం మొదలుపెట్టారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెడితే తాను బీసి తల్లి బిడ్డను కాబట్టే నన్ను పదవి నుంచి పడెయ్యాలి అనుకున్నారని ఆయన కామెంట్ చేసారు. ఇప్పుడు వాటిని జనం వింటున్నారా...? వినడానికి కూడా ఇష్టపడటం లేదు. మన్ కి బాత్ వినేది కేవలం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే అంటూ కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. జన్ కి బాత్ ఇప్పుడు నడుస్తుందని పలువురు వ్యంగ్యంగా కామెంట్లు కూడా చేస్తున్నారు. 

 

ఏడాదిన్నర కాలంలో బిజెపి పాలిత రాష్ట్రాల్లో 6 ఇంటిలో ఎన్నికలు జరిగితే బిజెపి గెలిచింది కాదు కాదు ప్రభుత్వం ఏర్పాటు చేసింది కేవలం ఒక్క హర్యానాలో మాత్రమే. కర్ణాటకలో వేధించి అధికారాన్ని లాక్కున్నారు. అయితే ఇప్పుడు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రూపంలో బిజెపికి మరిన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకోసం తనను నెత్తిన కూర్చోబెట్టుకున్న జేడియుని కూడా వదిలేసారు ఆయన. 

 

ఇప్పుడు ప్రశాంత్, అన్నీ కూడా బిజెపి వ్యతిరేక పార్టీలకే పని చేస్తున్నారు. ఢిల్లీలో ఆప్ గెలుపులో తన పాత్ర పోషించారు. ఇప్పుడు బీహార్ ని టార్గెట్ చేసారు. ఆ తర్వాత బెంగాల్, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్. ఇలా అన్ని రాష్ట్రాలను బిజెపికి దూరం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. ఈ సమయంలోనే ఆయన, బిజెపి పునాదుల మీద కొడుతున్నారు. కేవలం భావోద్వేగ రాజకీయమే బిజెపి చేస్తుందని ప్రశాంత్ కిషోర్ ప్రజల్లోకి తీసుకువెళ్తునట్టు తెలుస్తుంది. "బెంగాల్ గోర్బో మమతా" అంటూ సోషల్ మీడియాలో విస్త్రుత ప్రచారం చేస్తున్నారు. 

 

ఏ ప్రచారం అయితే బిజెపి చేస్తుందో అదే ప్రచారాన్ని ప్రశాంత్ చేస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా యువతలోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నాడు. ఏ దేశ భక్తి అని బిజెపి అంటుందో అదే విధంగా రాష్ట్ర గర్వం, రాష్ట్ర భక్తి అంటూ బిజెపికి రాష్ట్రాలను దూరం చేస్తున్నాడు. మీకు దేశ భక్తి పేరుతో బిజెపి అన్యాయం చేస్తుందని లోతుగా ప్రజల్లోకి తీసుకువెళ్తు బిజెపిని దెబ్బ కొడుతున్నాడు. బీహార్, బెంగాల్ లో బిజెపి గెలవడం కష్టం. ప్రశాంత్ దెబ్బకు బిజెపి ఉత్తరప్రదేశ్ ని కోల్పోయినా ఆశ్చర్యం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: