నిర్భయ కేసులో నిందితులకు ఇప్పటివరకు ఎలాంటి శిక్ష అమలు జరగలేదు.  కోర్టు నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించి చాలా కాలమైంది.  రెండు సార్లు ఉరి శిక్ష అమలును వాయిదా వేశారు.  కారణం నలుగురు నిందితులు ఒక్కొక్కరు చొప్పున న్యాయస్థానాన్ని, సుప్రీం కోర్టును, రాష్ట్రపతికి అభ్యర్ధనలు పెట్టుకోవడమే. కాగా, అన్ని కోర్టుల్లో న్యాయపరమైన విచారణ పూర్తయింది.  ఎక్కడా ఎలాంటి కేసులు కూడా పెండింగ్ లో లేవు.  దీంతో కోర్టు వీరికి డెత్ వారెంట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నది.  


సుప్రీం కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ  పూర్తయింది.  అయితే, విచారిస్తున్న జస్టిస్  భానుమతి సడెన్ గా సొమ్మసిల్లి పడిపోవడంతో కేసు సోమవారానికి వాయిదా పడింది.  ఎక్కడా ఎలాంటి కేసులు పెండింగ్ లేవు కాబట్టి స్పెషల్ కోర్టు డెత్ వారెంట్ ఇచ్చే వరకు ఆగాలని సుప్రీం కోర్టు అభిప్రాయ పడినట్టుగా తెలుస్తోంది.  అయితే, దీనికి ముందు నలుగురు దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ తనకు ఆరోగ్యం బాగాలేదని శిక్ష రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలుచేసుకున్నారు .  


కానీ, ఆ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.  దీంతో అన్ని పూర్తయ్యాయి.  సోమవారం  పాటియాలా కోర్టు డెత్ వారెంట్ మంజూరు చేసే ఛాన్స్ ఉన్నది.  ఒకవేళ కోర్టు డెత్ వారెంట్ ను జారీ చేస్తే అప్పుడైనా సక్రమంగా ఉరి అమలు జరుగుతుందా అన్నది చూడాలి.  ఒకవేళ జరగకపోతే, ఈసారి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా ప్రజలు కూడా ఉద్యమం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.  అలాంటిది ఏమైనా జరుగుతుందా లేదా అన్నది తెలియాలి అంటే సోమవారం వరకు ఆగాల్సి ఉంటుంది.  చూద్దాం.  


2012 డిసెంబర్ 16 వ తేదీన నిర్భయపై ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఆరుగురు నిందితులు ఆమెపై అత్యాచారం చేశారు.  సున్నితమైన భాగాల్లో పదునైన ఆయుధాలు ఉంచడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.  హాస్పిటల్ లో చికిత్స పొందుతూ డిసెంబర్  నెలాఖరులో మరణించింది.  ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది.  ఈ కేసును పోలీసులు నిందితులను పట్టుకొని శిక్ష పడే విధంగా చేసినా, చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని ఇంకా తప్పించుకుంటూనే ఉన్నారు దోషులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: