కామాంధుల కాలంలో మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. రోజు మొదలుకొని మహిళల పై ఎన్నో అఘాయిత్యా లను చూస్తూ ఉంటారు. అయితే బయట వాళ్ళు చేస్తున్నారంటే ఏదన్న అనుకోవచ్చు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళే అలా చేస్తే ఆడవాళ్లకు రక్షణ ఎక్కడ ఉంటుందని చాలా మంది ఆడవాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెల్లి అంటే తల్లితో సమానం గా చూసుకోవాల్సిన అన్న చెల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 

 

వివరాల్లోకి వెళితే.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చెల్లెలి ని రేప్ చేశాడు. ఎనిమిది నెలలుగా ఆమె పై అత్యాచారం చేస్తున్నాడు. ఫలితంగా ఆమె ఇప్పుడు ఏడు నెలల గర్భిణి. కూతురికి పీరియడ్స్ రాకపోవడంతో అనుమానం వచ్చి ఆస్పత్రికి తీసుకు పోతే డాక్టర్లు చెప్పిన మాట విని షాక్‌కు గురయ్యారు తల్లిదండ్రులు. కొడుకే కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిని రేప్ చేశాడన్న విషయం తెలుసుకుని గుండెబద్దలైంది.

 

ఈ ఘటన తమిళనాడు వెల్లూరు లో చోటు చేసుకుంది.. స్తోమత లేని కారణంగా కొడుకును పదోతరగతి వరకు చదివించి ఆపేసారు. కూతురు కూడా ఇంటిపనులు చేసుకుంటూ వస్తుంది. అయితే తల్లి తండ్రులు మాత్రం కూలీపనికి పోయేవారు. తాగుబోతు గా మారిన కొడుకు సొంత చెల్లిపై పలుమార్లు రేప్ చేసాడు. అయితే ఎనిమిది నెలలుగా నెలసరి రాకపోవడంతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. 

 


అక్కడ పరీక్షించిన వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు. ఆమె సుమారు గా ఎనిమిది నెలల గర్భం తో ఉన్నట్లు చెప్పడం తో తల్లిదండ్రులు హతాశులయ్యారు. అందుకు కారణం సొంత కొడుకేనని తెలిసి మరింత కుమిలిపోయారు. పోలీసులను ఆశ్రయించడంతో అన్నపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కొడుకు చేసిన పనికి సిగ్గుతో కుమిలిపోతున్నారు ఆ తల్లి దండ్రులు. అతనిని వెంటనే ఉరి తీయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: