కరోనా వైరస్ ఎందరికో కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.. ప్రపంచ దేశాలను పరేషాన్ చేస్తుంది.. ఇంకా తగ్గుముఖం పట్టని ఈ వ్యాధి చైనాలో తన ప్రతాపం చూపుతూ, రోజు రోజుకి వేగంగా విస్తరిస్తోంది. దీనితో మృతులు, బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం ఈ వైరస్ 65 వేల మందికి పైగానే సోకినట్టు సమాచారం.. అంతే కాకుండా ఈ వైరస్ కారణంగా, సుమారుగా 1400 వందల మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీన్ని నివారించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ వైరస్ మాత్రం రోజురోజు తన ప్రభావాన్ని చూపిస్తూ విస్తరిస్తోంది.

 

 

ఇకపోతే కరోనా వైరస్ భయంతో జపాన్ తీరంలో నిలిచిపోయిన విలాసవంతమైన నౌక డైమండ్ ప్రిన్సెస్‌లోని సిబ్బంది, ప్రయాణికుల్లో మొత్తం 138 భారతీయులు ఉన్న విషయం తెలిసిందే. అయితే  ఆ నౌకలో ఉన్న భారతీయులని బయటకి తీసుకురావడం సాధ్యపడదు అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక మరో విషయం ఏంటంటే  ఈ నౌకలో ఉన్న ఇద్దరు భారతీయులకి ఇప్పటికే కొవిడ్ -19 వైరస్ సోకిందట. ఇక వారికి నౌకలోనే చికిత్స అందిస్తున్నారని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు..

 

 

ఇదే కాకుండా, ఆ భారతీయుల గురించి, జపాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి వివరించారు. ఇకపోతే ఈ నౌకలో పనిచేస్తున్న భారతీయుల్లో అధిక శాతం ముంబై, కేరళ, గోవాలకు చెందినవారే ఉన్నారు... ఇక ఇప్పుడు కేంద్రం కూడా వీరి విషయంలో చేతులు ఎత్తివేస్తే వారి ప్రాణాలు ప్రమాదంలో పడ్దట్లే. సాటి మనుషులుగా స్పందించి వారికి సహాయమందించి, రక్షించవలసిన బాధ్యతను సంక్రమంగా నిర్వహించాలని వారి కుటుంబికులు వేడుకుంటున్నారు.. ఏది ఏమైనా అత్యుత్సాహంతో ఉరుకులాడే చైనా వల్ల ముందు ముందు ఇంకా ఎన్ని సమస్యలు పుట్టుకోస్తాయో అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: