జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్దితి చివరకు ఇలాగైపోయిందే.  బిజెపికి మిత్రపక్షంగా మారి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడదామని అనుకుంటే చివరకు తానే ఎటూ కాకుండా పోతున్నట్లున్నాడు. ఎందుకంటే జగన్ తో చేతులు కలపటానికి బిజెపి ప్రయత్నాలు చేస్తోందనే ప్రచారం నేపధ్యంలో జనసైనికుల్లో గందరగోళం పెరిగిపోతోంది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న పవన్ కూడా ఏం మాట్లాడాలో అర్ధం కాకుండా షాక్ కు గురైనట్లు చెప్పుకుంటున్నారు.

 

ఎన్డీఏలో వైసిపి చేరబోతోందనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఇందులో ఎంత వరకూ నిజముందో తెలీదు కానీ ప్రచారం మాత్రం చాలా ఉధృతంగా ఉంది. దానికి చంద్రబాబు మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంటిపై జరిగిన  ఐటి దాడుల్లో  2 వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు దొరికాయి. పిఎస్ దగ్గరే ఇన్ని వేల కోట్ల లావాదేవీల లెక్కలు దొరికితే ఇక చంద్రబాబు, చినబాబు లోకేష్ లను కూడా విచారిస్తే ఇంకెంత లావాదేవీలు బయటపడతాయో అనే ప్రచారం పెరిగిపోతోంది.

 

ఇటు ఐటి దాడులు అటు ఎన్డీఏలో జగన్ చేరబోతున్నారనే ప్రచారం మధ్యలో పవన్ బాగా ఇరుక్కుపోయారు. ఐటి దాడులు జరిగిన నేపధ్యంలో చంద్రబాబును సమర్ధించలేకపోతున్నాడు. అదే సమయంలో ఎన్డీఏలో వైసిపి చేరబోతుందనే ప్రచారాన్ని అడ్డుకునే అవకాశం లేదు. దాంతో ఇపుడు ఏం చేయాలో అర్ధంకాక పవన్ అవస్తలు పడుతున్నాడు. బిజెపిలో ఉండలేక అలాగని ఐటి వైసిపి విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోలేక నానా అవస్తలు పడుతున్నాడు.

 

పైగా 2 వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయంటూ స్వయంగా ఐటి అధికారులే అధికారికంగా ప్రకటన జారీ చేయటంతో  ఎవరూ దాన్ని కాదన లేకపోతున్నారు.  చంద్రబాబును సమర్ధించలేక ఐటి ప్రకటనను ఖండించలేక పవన్ అసలు మీడియాకే దొరకటం లేదు.  జగన్ మీద ప్రతిరోజు ట్విట్టర్లో రెచ్చిపోతున్న పవన్ ఐటి దాడుల నేపధ్యంలో మాత్రం కనీసం ట్విట్టర్లో కూడా స్పందించే ధైర్యం చేయలేకపోతుండటమే విచిత్రంగా ఉంది. పైగా మిత్రపక్షమైన బిజెపి నేతలు చంద్రబాబును చెండాడేస్తున్నారు. కనీసం వారిని కూడా నిలువరించలేక పవన్ షాక్ లోకి వెళిపోయినట్లున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: