ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా అధికారంలో ఉన్న వైయస్సార్ సిపి పార్టీ అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వికేంద్రీకరణ బిల్లును అదేవిధంగా సిఆర్డిఏ రద్దు బిల్లులను ఆమోదించే విషయం వైసీపీ వ్యూహాలు పన్నుతోంది. మరోపక్క ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కూడా వైసిపిని ఇరుకున పెట్టే విధంగా రాజకీయ వ్యూహాలు పన్నుతోంది. ఇటువంటి తరుణంలో ఏపీ గవర్నర్ శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ గురువారం సాయంత్రం గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నిర్ణయం వల్ల బాబు మరియు జగన్ ఇద్దరిలో ఒకరికి గట్టి దెబ్బ పడే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ మేధావులు కామెంట్ చేస్తున్నారు.

 

గవర్నర్ తీసుకున్న నిర్ణయం బట్టి మండలి సెలెక్ట్ కమిటీకి పంపించిన బిల్లులపై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకే అసెంబ్లీని ప్రోరోగ్ చేసినట్టు అంచనాకు వచ్చింది. దీంతో వికేంద్రీకరణ బిల్లు మరియు సి ఆర్ డి ఏ బిల్లు ఆమోదముద్ర పొందే అవకాశం ఎక్కువ ఉన్నట్లు టిడిపి డైలమాలో పడిందట. మరోపక్క 14 రోజులు గడిచిన సెలెక్ట్ కమిటీ హాజరు కాకపోవడంతో రెండు కీలక బిల్లులు పాస్ అయిపోయింది అంటూ వైసిపి వాదిస్తోంది.

 

దీంతో వైసిపి చేస్తున్న వాదనను తోసిపుచ్చి మనీ బిల్లుల విషయంలో 14 రోజుల నిబంధన వర్తిస్తుందని సాధారణ బిల్లుల విషయంలో 4 నెలల సమయం ఉంటుంది ఇది కూడా తెలియకపోతే ఇంకెందుకు అని వైసిపి పార్టీని ఎద్దేవా చేసింది టిడిపి. దీంతో ఇదంతా ఎందుకు అని భావించిన వైసీపీ అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. కానీ ఈసారి బాబు - జగన్ ఇద్దరిలో ఒకరికి గట్టిదెబ్బ పడటం గ్యారెంటీ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద జరగబోయే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్ హాట్ గా సాగే అవకాశం ఉన్నట్లు ప్రస్తుత పరిణామాలు బట్టి తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: