చంద్రబాబునాయుడు చుట్టూ పర్ఫెక్ట్ స్కెచ్ గీశారా ? ఎన్డీఏలో నుండి బయటకు వచ్చిసన తర్వాత నుండి స్కెచ్ గీయటం మొదలైందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నాయి. ఇదంతా ఎందుకంటే చంద్రబాబు దగ్గర పిఎస్ గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ పై జరిగిన దాడుల్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఐటి శాఖ అధికారికంగా విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ లోనే సుమారు రూ. 2 వేల కోట్లు విలువైన లెక్కల్లోకి రాని లావాదేవీలు బయటపడినట్లు చెప్పారు. అంటే ఈ మొత్తం శ్రీనివాస్ దగ్గరే దొరొకిందని చెప్పలేదు లేండి.

 

కడప, హైదరాబాద్, విశాఖపట్నం, పూనా, ఢిల్లీల్లో జరిపిన దాడుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్ధలు, నిర్మాణ సంస్ధలు తదితరాల్లో భారీగా బోగస్ బిల్లులు,  తప్పుడు ఇన్వాయిస్ లు, ఉనికిలో లేని కంపెనీల పేర్లతో కాంట్రాక్టులు చేసి దొంగ బిల్లులు రైజ్ చేయటం, పన్ను లెక్కలకు దొరక్కుండా డొల్ల పెట్టిన కంపెనీలు తదితరాలకు ఆధారాలు దొరికినట్లు చెప్పారు.  హైదరాబాద్, కడప, విజయవాడలో జరిగిన ఐటి దాడులన్నీ టిడిపికి సంబంధించిన వాళ్ళవే.

 

ఈ దాడుల్లోనే శ్రీనివాస్ కూడా ఒకటి. అయితే ఓ ప్రముఖుని దగ్గర పిఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ అన్నారే కానీ ఎక్కడా చంద్రబాబు పేరు మాత్రం ప్రస్తావించలేదు. మాజీ పిఎస్ ఇంటిపై జరిగిన దాడిలో బోగస్ రాకెట్ బయటపడినట్లు చెప్పారు.  ఓ ప్రముఖ కంపెనీ నుండి ప్రధాన కంపెనీలకు, సబ్ కాంట్రాక్టు సంస్ధలకు బిల్లులు చెల్లించినట్లు గుర్తించినట్లు కూడా చెప్పారు. అంటే వీటికి సంబంధించిన ఆధారాలన్నీ శ్రీనివాస్ దగ్గర దొరికిన డైరీలు, డాక్యుమెంట్లలో ఉండి ఉంటాయని అనుమానిస్తున్నారు.

 

నిజానికి చంద్రబాబుకున్న యంత్రాంగంలో శ్రీనివాస్ ది చిన్న పాత్ర మాత్రమే. ఇంతకన్నా పెద్ద తిమింగలాలు చంద్రబాబు దగ్గర చాలానే ఉన్నాయని అనుమానిస్తున్నారు. బహుశా ఇపుడు దొరికిన ఆధారాలతో శ్రీనివాస్ పై ఇప్పటికే కేసులు బుక్ చేసుంటారని అనుమానిస్తున్నారు. ఇదే గనుక జరిగితే శ్రీనివాస్ అనే తీగను కదిపితే ఎంత పెద్ద డొంక దొరుకుతుందో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: