2019 ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారు. దాదాపు తమ ఓటు హక్కుతో చావుదెబ్బ కొట్టిన అంతగా తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో ఫలితాలు వచ్చాక చాలా మంది తెలుగుదేశం పార్టీకి నమ్మకంగా ఉన్న నాయకులు పార్టీ జంప్ అయిపోయారు. ఇటువంటి తరుణంలో ప్రతిపక్షంలో ముక్కుతూ మూలుగుతూ పార్టీని నడుపుతున్నారు చంద్రబాబు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంటే రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ముగ్గుస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వార్తలు వినపడుతున్నాయి.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. 11 రాజ్యసభ స్థానాల్లో ప్రజెంట్ రెండు వైసిపి పార్టీ చేతుల్లో ఉండగా మరో 9 టీడీపీ చేతుల్లో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ చూసుకుంటే మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలు ఓడిపోయే ముందు వరకు ఉన్నాయి. ఆరుగురిలో నలుగురు బీజేపీలో చేరి పోయారు. రాబోయే రోజుల్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయం లో బలమైన అధికార పార్టీ గా వైసీపీ ఉండటంతో 4 స్థానాలు వైసీపీ చేతుల్లో ఉండబోతున్నట్లు సమాచారం.

 

వచ్చే ఎలక్షన్ వాటికి రాజ్యసభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి ఏమీ ఉండదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటువంటి దయనీయమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రాణిస్తున్న క్రమంలో మరోపక్క ఐటీ దాడులు ఇటీవల జరిగాయి. దాడులలో ఎక్కువగా చంద్రబాబు పేరు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీకి చెందిన 11 మంది నేతలు వైసీపీలోకి వెళ్ళటానికి మొత్తం స్కెచ్ రెడీ చేస్తున్నట్లు ఆంధ్ర రాజకీయాల్లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: