తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా స్టార్ లీడర్ ఉన్నారు అంటే... ఎక్కువగా వినపడే పేరు యువనేత రేవంత్ రెడ్డి. ఆ పార్టీలో ప్రస్తుతం స్టార్ లీడర్ గా ఉన్నారు ఆయన. ఆయన రేంజ్ లో మైలేజ్ ఉన్న నాయకుడు మరొకరు లేరు అనేది వాస్తవం. అయితే ఆయనకు అందాల్సిన సహకారం మాత్రం ఇప్పటి వరకు అందలేదు అనేది వాస్తవం.

 

రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నా సరే ఆయనను పట్టించుకునే పరిస్థితి ఆ పార్టీలో ఎక్కడా కనపడటం లేదని అంటున్నారు పలువురు. కొంత కాలంగా కాంగ్రెస్ రాజకీయాన్ని దగ్గరగా చూస్తే ఇదే విషయం స్పష్టంగాఅర్ధమవుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో బ్రతకాలి అంటే రేవంత్ లాంటి ఇమేజ్ ఉన్న నాయకుడు కావాలని సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తలు ఎన్నో కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే ఆయనకు మాత్రం సరైన గుర్తింపు ఇప్పటి వరకు దక్కలేదు.

 

కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ కుమార్ రెడ్డి నుంచి చాలా మంది నేతల వరకు రేవంత్ కి సరైన సహకారం మాత్రం అందించడం లేదు. ఈ విషయం ఎన్నికల్లో కూడా స్పష్టంగా అర్ధమైంది. ఆయన దూకుడు ఉన్న నేత కావడం, ఆయనతో ఉంటే తమకు గుర్తింపు రాదు అని సొంత పార్టీ నేతలే బాధపడటం రేవంత్ ని ఇబ్బంది పెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. 

 

ఉత్తమ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఆ పదవి తనకు కావాలని రేవంత్ అడిగినా సరే అధిష్టానం నుంచి మాత్రం ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా ఉన్నా సరే తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని భావిస్తున్నారు.

 

స్వేచ్చగా పోరాడాలి అంటే తనకు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అయితేనే బాగుంటుంది అని రేవంత్ భావిస్తున్నారు. కాని అధిష్టాన౦ మాత్రం ససేమీరా అంటుంది. నల్గొండ ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డికి పదవి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆయన లాబియింగ్ చేసారని అందుకే వరించే అవకాశం ఉందని టాక్. దీనితో గుడ్ బై చెప్పే ఆలోచనలో రేవంత్ ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: